'తెలంగాణ ఉద్యోగులెవరో మేమే ప్రకటిస్తాం' | secretariat telangana employees union oppose list | Sakshi
Sakshi News home page

'తెలంగాణ ఉద్యోగులెవరో మేమే ప్రకటిస్తాం'

May 20 2014 3:57 PM | Updated on Sep 6 2018 3:01 PM

విభజన కోసం అధికారులు ప్రకటించిన సచివాలయ ఉద్యోగుల లిస్ట్‌ తప్పుల తడకగా ఉందని సచివాలయ తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నరేంద్రరావు ఆరోపించారు.

హైదరాబాద్: విభజన కోసం అధికారులు ప్రకటించిన సచివాలయ ఉద్యోగుల లిస్ట్‌ తప్పుల తడకగా ఉందని సచివాలయ తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నరేంద్రరావు ఆరోపించారు. నిజమైన తెలంగాణ ఉద్యోగులెవరో తామే ప్రకటిస్తామని చెప్పారు. వారు మాత్రమే తెలంగాణ సచివాలయంలో పనిచేయాలని సూచించారు.

ఒక్క సీమాంధ్ర ఉద్యోగిని కూడా తెలంగాణలో పనిచేయనివ్వబోమని స్పష్టం చేశారు. అధికారులు ప్రకటించిన ఉద్యోగుల లిస్టే ఫైనల్ అయితే తెలంగాణ ఏర్పాటుకు అర్ధమే లేదన్నారు. సచివాలయంలో ఉద్యోగులందరి స్థానికత వివరాలను అధికారులు మంగళవారం ప్రభుత్వ వెబ్సైట్లో ఉంచారు. అభ్యంతరాలు ఉంటే ఒక్కరోజులోనే తెలపాలని ఆదేశాలు జారీ చేశారు. దాంతో ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది.

Advertisement
 
Advertisement
Advertisement