మదనపల్లిలో రెచ్చిపోయిన దొంగలు | robbery in Madanapalli | Sakshi
Sakshi News home page

మదనపల్లిలో రెచ్చిపోయిన దొంగలు

Oct 4 2015 6:21 PM | Updated on May 10 2018 12:34 PM

చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఆదివారం దొంగలు రెండిళ్లలో చోరీలకు తెగబడ్డారు.

చిత్తూరు జిల్లా మదనపల్లిలో దొంగలు మరో సారి చెలరేగి పోయారు. ఆదివారం రెండిళ్లలో చోరీలకు తెగబడ్డారు. వివరాల్లోకి వెళితే.. కురవంక కాలనీలో శనివారం అర్ధరాత్రి చుక్కం రఘు, సాయి గణేష్ ఇళ్ల తాళాలను గడ్డపారతో పగులగొట్టి రూ.లక్ష నగదు, 28 గ్రాముల బంగారు ఆభరణాలు దోచుకుపోయారు.

బాధితులు ఆదివారం ఉదయం ఇంటికి తిరిగి వచ్చి చోరీ విషయాన్ని తెలుసుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారం క్రితం ఇదే ప్రాంతంలో దొంగలు మూడిళ్లల్లో చోరీలకు పాల్పడ్డ సంగతి తెలిసిందే...
 

Advertisement
 
Advertisement
Advertisement