తనిఖీలు : 23 మంది ఎర్రచందనం కూలీలు అరెస్ట్ | red sandalwood labour arrested in ysr district | Sakshi
Sakshi News home page

తనిఖీలు : 23 మంది ఎర్రచందనం కూలీలు అరెస్ట్

Jun 4 2016 8:13 AM | Updated on Aug 20 2018 4:44 PM

వైఎస్ఆర్ కడప జిల్లా రైల్వే కోడూరు మండలం బాలుపల్లి వద్ద పోలీసులు శనివారం తనిఖీలు నిర్వహించారు.

కడప : వైఎస్ఆర్ కడప జిల్లా రైల్వే కోడూరు మండలం బాలుపల్లి వద్ద పోలీసులు శనివారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా బస్సులో ప్రయాణిస్తున్న 23 మంది తమిళ కూలీలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 30 ఎర్రచందనం దుంగలను అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

మరో 40 మంది ఎర్రచందనం కూలీలు పరారైయ్యారు. పట్టుబడిన కూలీలను పోలీస్ స్టేషన్కు తరలించి.. విచారిస్తున్నారు. పక్కా సమాచారంతో అటవీ అధికారులు తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. పరారీలో ఉన్న కూలీల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement