స్థిరంగా కొనసాగుతున్న అల్పపీడనం | rains in telangana, coastal andhra | Sakshi
Sakshi News home page

స్థిరంగా కొనసాగుతున్న అల్పపీడనం

Jul 23 2014 2:17 AM | Updated on Sep 2 2017 10:42 AM

ఛత్తీస్‌గఢ్ నుంచి దక్షిణ కోస్తా, తెలంగాణ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది.

 కోస్తా, తెలంగాణల్లో చెదురుమదురు వర్షాలు
 
 సాక్షి, విశాఖపట్నం: ఛత్తీస్‌గఢ్ నుంచి దక్షిణ కోస్తా, తెలంగాణ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో అక్కడక్కడ, తెలంగాణలో కాస్త ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. రాగల 48 గంటల్లో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్‌లలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురవొచ్చని వాతావరణ శాఖ వెల్లడించింది. సోమవారం వాయుగుండంగా మారిన అల్పపీడనం ప్రస్తుతం తూర్పు మధ్యప్రదేశ్‌పై ఉంది. దీని ప్రభావం మనపై ఏ మాత్రం ఉండబోదని, రాగల 24 గంటల్లో ఇది మరింత బలహీనపడొచ్చని వాతావరణ నిపుణులు తెలిపారు. కోస్తా తీరం వెంబడి పశ్చిమ దిశ నుంచి గంటకు 45 నుంచి 50 కి.మీ. వేగంతో ఈదురు గాలులుంటాయని మత్స్యకారులకు ప్రత్యేక హెచ్చరికలు జారీచేశారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement