వధూవరులపై సైకో దాడి | psycho attacks on new couple | Sakshi
Sakshi News home page

వధూవరులపై సైకో దాడి

May 13 2015 3:15 PM | Updated on Oct 20 2018 7:44 PM

తిరుమలలోని ఓ కల్యాణ వేదిక వద్ద ఓ సైకో వధూవరులపై దాడి చేశాడు.

తిరుపతి: పెళ్లి వేడుకలో బంధువులందరూ సంబరాల్లో మునిగిపోయారు. మూడుముళ్ల బంధంతో ఒక్కటైన నూతన వధూవరులు పెద్దల నుంచి ఆశీస్సులు పొందారు. ఇంతలో ఊహించని దాడి జరిగింది. తిరుమలలోని ఓ కల్యాణ వేదిక వద్ద ఓ సైకో వధూవరులపై దాడి చేశాడు. వధువు మెడలో ఉన్న నగలను లాక్కోబోయాడు. బంధువలు అతణ్ని పట్టుకుని దే హశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించారు.  సైకోను ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు చేయించిన అనంతరం పోలీసులు అతడిని అదుపులోకి తీసుకోనున్నారు. సైకోకు సంబంధించిన వివరాలు తెలియాల్సివుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement