ఫుడ్‌ ప్యాకెట్లు: దేశాధ్యక్షుడి కోపం | President Ram Nath Kovind pauses speech, chides conference organisers for handing out food during address | Sakshi
Sakshi News home page

ఫుడ్‌ ప్యాకెట్లు: దేశాధ్యక్షుడి కోపం

Dec 27 2017 8:22 PM | Updated on Jun 2 2018 3:08 PM

 President Ram Nath Kovind pauses speech, chides conference organisers for handing out food during address - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ పర్యటనలో భారత అధ్యక్షుడు రామ్‌నాధ్‌ కోవింద్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఆయన  ప్రసంగం సందర్భంగా సభలో గందరగోళం రేగడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.  రెండు నిమిషాలు తన  ప్రసంగాన్ని ఆపివేసి మరీ నిర్వాహకులను సుతిమెత్తగా మందలించారు.

ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్ కాన్ఫరెన్స్‌  ప్రసంగం సందర్భంగా దేశ ప్రథమ పౌరుడు రామ్‌నాథ్‌ కోవింద్‌కు కోపం వచ్చింది.  ఆయన  ప్రసంగం కొనసాగుతుండగానే వాలంటీర్లు  ఆహార పాకెట్లను పంపిణీ చేయడం ప్రారంభించారు.  దీంతో ప్రతినిధులు ,  మీడియా వ్యక్తలు, విద్యార్థుల బృందం వారి సీట్లు నుంచి లేచి ఫుడ్‌ ప్యాకెట్ల కోసం ఎగబడ్డారు. దీంతో రామ్‌నాథ్‌ కోవింద్‌  ఆర్థిక ప్రపంచంలో ఏం జరుగుతుందో ... ఈ సమావేశంలో అదే చిత్రాన్ని చూస్తున్నానంటూ  ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ప్రసంగం ముగిసే వరకు ప్యాకెట్లను పంపిణీ చేయమని వారిని కోరారు. దీంతో ఉలిక్కి పడిన పోలీసులు, ఇతర అధికారులు పరిస్థితిని చక్కదిద్దారు.  దీంతో దేశాధ్యక్షుడు మళ్లీ తన  ప్రసంగాన్ని కొనసాగించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement