ఎక్కండయ్యా బాబూ.. ఎక్కండయ్యా బండి.. ఎక్కండయ్యా.. అంటూ సమైక్యాంధ్ర పార్టీ నేతలు ప్రజలను బతిమాలుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి
ఎక్కండయ్యా బాబూ.. ఎక్కండి
Mar 13 2014 1:13 AM | Updated on Sep 2 2017 4:38 AM
దేవరపల్లి, న్యూస్‌లైన్ : ఎక్కండయ్యా బాబూ.. ఎక్కండయ్యా బండి.. ఎక్కండయ్యా.. అంటూ సమైక్యాంధ్ర పార్టీ నేతలు ప్రజలను బతిమాలుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి నూతనంగా పెట్టిన సమైక్యాంధ్ర పార్టీ రాజమండ్రిలో బుధవారం నిర్వహించే సదస్సుకు ప్రజల తరలింపునకు ఆ పార్టీ నేతలు అష్టకష్టాలు పడ్డారు. గోపాలపురం నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో సుమారు 50 బస్సులను ఏర్పాటు చేశారు. సదస్సుకు వెళ్లడానికి ప్రజలు బస్సు ఎక్కేందుకు రాకపోవడంతో కనిపించిన వారిని బతిమిలాడి మొహమాటపెడుతూ బస్సులు ఎక్కించారు. అంతేకాక బస్సు ఎక్కిన వారికి రూ. 200 ఇస్తామని చెప్పడంతో కొంతమంది ఇష్టం లేకపోయినా డబ్బులు కోసం సదస్సుకు వెళ్లారు. ఒక్కొక్క బస్సులో పట్టుమని 10 మంది కూడా లేకపోవడంతో బస్సులు ఖాళీగా వెళ్లాయి. సాయంత్రం ఆరు గంటల వరకూ బస్సులు వెళుతూనే ఉన్నాయి.
Advertisement


