'రాష్ట్రాన్ని ఒక దొంగ పరిపాలిస్తున్నారు' | peddireddy and bhumana fire on chandra babu naidu | Sakshi
Sakshi News home page

'రాష్ట్రాన్ని ఒక దొంగ పరిపాలిస్తున్నారు'

Jun 25 2015 2:38 PM | Updated on Jul 28 2018 6:48 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక దొంగ పరిపాలిస్తున్నాడని (సీఎం చంద్రబాబును ఉద్దేశించి) వైఎస్సార్సీపీ నేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు.

చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక దొంగ పరిపాలిస్తున్నాడని (సీఎం చంద్రబాబును ఉద్దేశించి) వైఎస్సార్సీపీ నేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. గురువారం వారు ఇక్కడ మీడియాతో మాట్లాడారు. 5 కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తన స్వార్థం కోసం చంద్రబాబు తాకట్టు పెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. "అబద్ధపు హామీలతో సీఎం అయ్యారు. ప్రతిపక్షంలో ఉండి అధికార పక్షానికి ఓటేసి ముఖ్యమంత్రి అయ్యారు.  రైతు సమస్యలు తీర్చకుండా 20 శాతం రైతులకు కూడా విత్తనాలు పంపిణీ చేయని ఘనత" చంద్రబాబుకే దక్కుతాయని వారు ఆరోపించారు.

Advertisement
 
Advertisement
Advertisement