ప్రశ్నిస్తానంటునే...ప్లీజ్ అన్న పవన్! | pawan kalyan praises chandrababu naidu | Sakshi
Sakshi News home page

ప్రశ్నిస్తానంటునే...ప్లీజ్ అన్న పవన్!

Mar 6 2015 1:19 PM | Updated on Mar 22 2019 5:33 PM

ప్రశ్నిస్తానంటునే...ప్లీజ్ అన్న పవన్! - Sakshi

ప్రశ్నిస్తానంటునే...ప్లీజ్ అన్న పవన్!

పవన్ కల్యాణ్‌ ప్రశ్నలో పస లేదు. ప్రశ్నలో ఉరిమే ఉత్సాహం లేదు.. ? ప్రశ్నిస్తే ..ఎవర్ని ప్రశ్నించదలచుకున్నామో..వారి మనసులోకి ప్రశ్న సూటిగా దిగాలి

హైదరాబాద్ : పవన్ కల్యాణ్‌ ప్రశ్నలో పస లేదు. ప్రశ్నలో ఉరిమే ఉత్సాహం లేదు.. ? ప్రశ్నిస్తే ..ఎవర్ని ప్రశ్నించదలచుకున్నామో..వారి మనసులోకి  ప్రశ్న సూటిగా దిగాలి. కానీ.. పవన్ కల్యాణ్ ...చంద్రబాబు నాయుడును..ప్లీజ్‌ అన్నారు... దేహీ అన్నారు. పేదల తరపున మాట్లాడుతున్నాను అంటూనే...గొంతు పేలవంగా వినిపించారు..

ఒకపక్క రైతులకు అన్యాయం జరుగుతుందంటూనే..మరోపక్క  చంద్రబాబు నాయుడు చేసేది మంచేదేనని చెప్పుకొచ్చారు. రాజధాని  ప్రాంత రైతులకు ప్యాకేజీ చాలా బాగుందని ప్రశంసించారు. చంద్రబాబు నాయుడు పదేళ్ల పాటు సీఎంగా ఉండాలని పవన్ కల్యాణ్ ఆకాంక్షిచారు.  టీడీపీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి తాను మీడియా సమావేశం  పెట్టలేదన్నారు.

రాజధాని ప్రాంతంలో పర్యటించేటప్పుడు..అవసరమైతే నిరహార దీక్ష చేస్తానన్న పవన్ కల్యాణ్ ..ఈ విషయంపై విలేకరి అడిగిన ప్రశ్నకు ..సమాధానం చెప్పకుండా దాటవేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో పవన్ కల్యాణ్ గురువారం పర్యటించిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement