breaking news
capital city area tour
-
ఏ ముఖంతో రాజధానిలో పర్యటన?
సాక్షి, అమరావతి/అమరావతి బ్యూరో/ తుళ్లూరు: అమరావతి పేరుతో అన్ని రకాలుగా మోసగించిన ప్రతిపక్ష నేత చంద్రబాబు తొలుత బహిరంగ క్షమాపణ చెప్పాలని రాజధాని రైతులు, దళితులు డిమాండ్ చేశారు. రైతులకు సమాధానం చెప్పకుండా రాజధానిలో పర్యటిస్తే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ముఖ్యమంత్రిగా ఉండగా తమను నానా ఇబ్బందులు పెట్టిన చంద్రబాబు ఏ ముఖం పెట్టుకుని రాజధానిలో పర్యటిస్తారని స్థానిక రైతులు ప్రశ్నించారు. వెలగపూడిలోని సచివాలయం సమీపంలో రాజధాని గ్రామాలకు చెందిన రైతులు మాదల మహేంద్ర, శృంగారపు సందీప్, బెజ్జం రాంబాబు, తుమ్మల రమణారెడ్డి, కొండేపాటి బుజ్జి, బొర్రా శివారెడ్డి తదితరులు సోమవారం మీడియాతో మాట్లాడారు. రాజధాని ప్రకటన సమయంలో టీడీపీ నేతలతో పంట పొలాలు తగులబెట్టించి వైఎస్సార్ సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించిన ఘనత చంద్రబాబుదేనన్నారు. తాత్కాలిక భవనాల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ధ్వజమెత్తారు. అమరావతిపై చంద్రబాబుకు అంత ప్రేమ ఉంటే గెజిట్ నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేదు?, పర్మినెంట్ భవనాలు ఎందుకు కట్టలేదు? అని ప్రశ్నించారు. రాజధాని పేరుతో దోచుకుని ఇప్పుడు పర్యటనకు సిద్ధం కావడం సిగ్గు చేటన్నారు. గ్రాఫిక్స్‌తో నాలుగేళ్లు కాలక్షేపం.. రైతులను రెచ్చగొట్టేందుకే చంద్రబాబు ఈనెల 28న రాజధాని ప్రాంతంలో పర్యటన తలపెట్టారని మండిపడ్డారు. టీడీపీ అధికారంలో ఉండగా తమ అభిప్రాయాలు సేకరించకుండా భూములు తీసుకున్నారని, గ్రామ సభల్లో ప్రశ్నించిన వారిపై కేసులు బనాయించారని చెప్పారు. భూములిచ్చిన రైతులకు న్యాయం జరగలేదని, హామీలను సైతం అమలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకిచ్చిన ప్లాటు ఎక్కడుందో కూడా తెలియదని, భూములు తీసుకుని అన్ని రకాలుగా మోసం చేశారని వాపోయారు. రాజధాని నిర్మిస్తున్నామంటూ గ్రాఫిక్స్ బొమ్మలు చూపించి నాలుగేళ్లు కాలక్షేపం చేసి అన్నీ తాత్కాలిక కట్టడాలే చేపట్టారని విమర్శించారు. టీడీపీ సర్కారు తమను మోసం చేసిందన్నారు. ఉచిత విద్య, వైద్యం అంటూ వంచించారని, ప్లాట్ల పంపిణీలో గోల్మాల్ జరిగిందని ఆరోపించారు. రాజధాని పేరుతో చంద్రబాబు, లోకేష్, నారాయణ కమీషన్లు కాజేసి తొమ్మిది వేల ఎకరాలను ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా కారుచౌకగా కొనుగోలు చేశారని చెప్పారు. తమ అభ్యర్థన మేరకు ప్రతిపక్ష నేతగా ఉండగా వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజధానిలో పర్యటిస్తే పసుపు నీళ్లు చల్లించారని, ఇప్పుడు చంద్రబాబు పర్యటన నేపథ్యంలో తాము అలాగే చేయాలా? అని ప్రశ్నించారు. -
ప్రశ్నిస్తానంటునే...ప్లీజ్ అన్న పవన్!
హైదరాబాద్ : పవన్ కల్యాణ్ ప్రశ్నలో పస లేదు. ప్రశ్నలో ఉరిమే ఉత్సాహం లేదు.. ? ప్రశ్నిస్తే ..ఎవర్ని ప్రశ్నించదలచుకున్నామో..వారి మనసులోకి ప్రశ్న సూటిగా దిగాలి. కానీ.. పవన్ కల్యాణ్ ...చంద్రబాబు నాయుడును..ప్లీజ్ అన్నారు... దేహీ అన్నారు. పేదల తరపున మాట్లాడుతున్నాను అంటూనే...గొంతు పేలవంగా వినిపించారు.. ఒకపక్క రైతులకు అన్యాయం జరుగుతుందంటూనే..మరోపక్క చంద్రబాబు నాయుడు చేసేది మంచేదేనని చెప్పుకొచ్చారు. రాజధాని ప్రాంత రైతులకు ప్యాకేజీ చాలా బాగుందని ప్రశంసించారు. చంద్రబాబు నాయుడు పదేళ్ల పాటు సీఎంగా ఉండాలని పవన్ కల్యాణ్ ఆకాంక్షిచారు. టీడీపీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి తాను మీడియా సమావేశం పెట్టలేదన్నారు. రాజధాని ప్రాంతంలో పర్యటించేటప్పుడు..అవసరమైతే నిరహార దీక్ష చేస్తానన్న పవన్ కల్యాణ్ ..ఈ విషయంపై విలేకరి అడిగిన ప్రశ్నకు ..సమాధానం చెప్పకుండా దాటవేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో పవన్ కల్యాణ్ గురువారం పర్యటించిన విషయం తెలిసిందే. -
అభివృద్ధి రాజకీయ నాయకులకా?రైతులకా?
-
చంద్రబాబు పాలన బాగుంటుందనే...పవన్
-
ఎవరితో విభేదాలు లేవు: పవన్ కల్యాణ్
-
చంద్రబాబు పాలన బాగుంటుందనే...పవన్
చంద్రబాబు నాయుడుకు పరిపాలనా అనుభవం బాగుంటుందనే ఆయనకు మద్దతు ఇచ్చినట్లు సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. ఆయన శుక్రవారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ మహాత్మాగాంధీ కోరుకున్న గ్రామ స్వరాజ్యం కావాలని... అయితే అభివృద్ధి పేరుతో గ్రామాలను చంపేయవద్దని అన్నారు. ఆయన తన ప్రసంగంలో '90 శాతంమంది రైతుల స్వచ్ఛందంగా ఇచ్చారని మంత్రులు చెప్పారు. సింగపూర్ లాంటి రాజధానిని కట్టాలనుకోవడం మంచి విషయమే. అయితే రైతుల నుంచి భూ సేకరణ చేసేటప్పుడు ప్రభుత్వం ఎలాంటి బాధ్యత వహించాలి. ఇది అధికారం కోసం చేస్తున్న పోరాటం కాదు..ప్రజల నిజమైన సమస్యల కోసం. తిరిగి ప్రభుత్వానికి ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేదు. ప్రభుత్వం ఇచ్చే ప్యాకేజీలు సరిపోవడం లేదని అక్కడ ఉండవల్లి రైతులు నాతో అన్నారు. మూడు పంటలు పండే భూములు ఇవ్వమని పెనుమాక గ్రామస్తుతు తెలిపారు. బహుళ పంటలు పండే భూముల సేకరణకు అప్పట్లో రాజ్‌నాథ్ సింగ్ వ్యతిరేకించారు. ఇప్పటికీ ప్రభుత్వానికి మూడుసార్లు భమూలు ఇచ్చామని బేతపూడి గ్రామాస్తులు చెప్పారు. నేను పోరాటం చేస్తే అభివృద్ధి నిరోధకుడని నన్ను జైల్లో పెడతారు. భూములు ఇచ్చిన తర్వాత గ్యారెంటీ ఎలా ఉంటుందని తుళ్లూరు రైతులు ఆందోళన చెందుతున్నారు. భవిష్యత్‌పై అక్కడి రైతులు ఆందోళన చెందుతున్నారు. గతంలో హైదరాబాద్ సేకరించిన భూమిలో చాలా భూమి ఇంకా ఖాళీ ఉంది. 32 వేల ఎకరాలు సేకరిస్తే ఎప్పటికి అభివృద్ధి చెందుతుంది' అని ప్రశ్నించారు. -
ఎవరితో విభేదాలు లేవు: పవన్ కల్యాణ్
తాను ఏ ప్రభుత్వాన్ని విమర్శించే విధంగా మాట్లాడలేదని సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. పెద్దలు చేసిన తప్పిదాలు భవిష్యత్ తరాలపై పడ్డాయని ఆయన అన్నారు. పవన్ కల్యాణ్ హైదరాబాద్‌లో శుక్రవారం ఉదయం మీడియా సమావేశంలో మాట్లాడుతూ భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలన్నారు. తనకు ఎవరితోనూ వ్యక్తిగత విభేదాలు లేవని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన సరిగా జరగలేదని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. పెద్ద మనుషుల ఒప్పందం సరిగా పాటించకపోవటం వల్లే ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయిందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసినప్పుడు రెండు రాష్ట్రాల ప్రజలు కొట్టుకునే స్థితి రాకూడదని కోరినట్లు పవన్ కల్యాణ్ తెలిపారు. విభజన కారణంగా సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని... అధికారులే కాదు పోలీసులు కూడా కొట్టుకునే పరిస్థితి వచ్చిందన్నారు. తన పోరాటం అధికారం కోసం కాదని, ప్రజల కోసమని ఆయన అన్నారు. -
ఉదయం 11గం.కు పవన్ మీడియా సమావేశం
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాజధాని గ్రామాల్లో పర్యటించిన సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఆయన మీడియాతో మాట్లాడనున్నారు. కాగా రాజధాని కోసం రైతులు ఇష్టపడి భూములిస్తే సంతోషమే. ఇవ్వలేమన్న రైతులను వదిలేయడం మంచిది. కాదని ప్రభుత్వం మొండిగా భూ సేకరణకు దిగితే మాత్రం ఊరుకోను. బాధిత రైతుల పక్షాన పోరాటం చేస్తా, రోడ్డు మీదకొచ్చి జనసేన సత్తా చూపుతా అని పవన్ కల్యాణ్ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మీడియా సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. -
రాజధాని కట్టాలంటే 20 ఏళ్లు పడుతుంది: పవన్
ఇన్ని వేల ఎకరాల్లో రాజధాని నగరం కట్టాలంటే దానికి 20 సంవత్సరాలు పడుతుందని జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీహీరో పవన్ కల్యాణ్ అన్నారు. గుంటూరు జిల్లాలోని రాజధాని ప్రాంత గ్రామాల్లో పర్యటించిన ఆయన.. అక్కడి సభల్లో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. రాజధాని నిర్మాణానికి అన్ని పార్టీలు సహకరించాలని, అయితే ఇష్టంలేని గ్రామాల్లో మాత్రం భూములు లాక్కోవద్దని పవన్ అన్నారు. భూసేకరణ చట్టంతో చిన్న కమతాలున్న రైతులను ఇబ్బంది పెట్టొద్దని తెలిపారు. ఇంకా ఆయన ఏమన్నారంటే... చంద్రబాబుకు పాలనా అనుభవం ఉందనే మద్దతు ఇచ్చా ఈ క్షణం వరకు కూడా ఆయనంటే గౌరవం ఉంది. ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ క్షణం వరకు నేను బయటకు రాలేదు సీఎం, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు.. ప్రజా సమస్యలను వారే చూసుకుంటారు భూసమీకరణలో భాగంగా అన్ని గ్రామాల ప్రజలు భూములు ఇవ్వడం ఆనందం కలిగించింది. ఎందుకంటే, భూసేకరణ అన్నది చాలా ఇబ్బంది కలిగించే అంశం సింగపూర్ నిర్మాణానికి 50 సంవత్సరాలు పట్టింది టీడీపీయే కాదు.. అన్ని పార్టీలూ బాధ్యతగా ఉండాలి స్వచ్ఛందంగా ఇచ్చిన రైతులు కూడా భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు పాలనాదక్షత ఉన్న వ్యక్తి. ఆ భయాలు అక్కర్లేదనే అనుకుంటున్నా మనకు ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్రం చెప్పింది.. ఇప్పటివరకు ఈ ఊసు ఎత్తలేదు రైతులకు రుణమాఫీ చేస్తానని చంద్రబాబు చెప్పారు, మాఫీచేయాలని అనుకున్నారు కానీ దానికి తగ్గ నిధుల్లేవు. ఆ నిధులు ఎలా సమీకరించాలన్నదే సమస్య మలేషియా రాజధాని పుత్రజయను 8వేల ఎకరాల్లో ప్రారంభించారు ఇప్పుడు 15 ఏళ్ల తర్వాత అది 16 వేల ఎకరాలకు విస్తరించింది స్వచ్ఛందంగా భూములు ఇచ్చినవాళ్లు అలాగే నిలబడాలి పోలవరం ప్రాజెక్టుకు వేలకోట్లు ఇస్తామని చెప్పి.. రూ. 100కోట్లే ఇచ్చారు