రాజధాని కట్టాలంటే 20 ఏళ్లు పడుతుంది: పవన్ | it will take 20 years to construct capital city, says pawan kalyan | Sakshi
Sakshi News home page

రాజధాని కట్టాలంటే 20 ఏళ్లు పడుతుంది: పవన్

Mar 5 2015 4:23 PM | Updated on Mar 22 2019 5:33 PM

రాజధాని కట్టాలంటే 20 ఏళ్లు పడుతుంది: పవన్ - Sakshi

రాజధాని కట్టాలంటే 20 ఏళ్లు పడుతుంది: పవన్

ఇన్ని వేల ఎకరాల్లో రాజధాని నగరం కట్టాలంటే దానికి 20 సంవత్సరాలు పడుతుందని జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీహీరో పవన్ కల్యాణ్ అన్నారు.

ఇన్ని వేల ఎకరాల్లో రాజధాని నగరం కట్టాలంటే దానికి 20 సంవత్సరాలు పడుతుందని జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీహీరో పవన్ కల్యాణ్ అన్నారు. గుంటూరు జిల్లాలోని రాజధాని ప్రాంత గ్రామాల్లో పర్యటించిన ఆయన.. అక్కడి సభల్లో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. రాజధాని నిర్మాణానికి అన్ని పార్టీలు సహకరించాలని, అయితే ఇష్టంలేని గ్రామాల్లో మాత్రం భూములు లాక్కోవద్దని పవన్ అన్నారు. భూసేకరణ చట్టంతో చిన్న కమతాలున్న రైతులను ఇబ్బంది పెట్టొద్దని తెలిపారు. ఇంకా ఆయన ఏమన్నారంటే...

  • చంద్రబాబుకు పాలనా అనుభవం ఉందనే మద్దతు ఇచ్చా
  • ఈ క్షణం వరకు కూడా ఆయనంటే గౌరవం ఉంది.
  • ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ క్షణం వరకు నేను బయటకు రాలేదు
  • సీఎం, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు.. ప్రజా సమస్యలను వారే చూసుకుంటారు
  • భూసమీకరణలో భాగంగా అన్ని గ్రామాల ప్రజలు భూములు ఇవ్వడం ఆనందం కలిగించింది.
  • ఎందుకంటే, భూసేకరణ అన్నది చాలా ఇబ్బంది కలిగించే అంశం
  • సింగపూర్ నిర్మాణానికి 50 సంవత్సరాలు పట్టింది
  • టీడీపీయే కాదు.. అన్ని పార్టీలూ బాధ్యతగా ఉండాలి
  • స్వచ్ఛందంగా ఇచ్చిన రైతులు కూడా భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు
  • చంద్రబాబు పాలనాదక్షత ఉన్న వ్యక్తి. ఆ భయాలు అక్కర్లేదనే అనుకుంటున్నా
  • మనకు ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్రం చెప్పింది.. ఇప్పటివరకు ఈ ఊసు ఎత్తలేదు
  • రైతులకు రుణమాఫీ చేస్తానని చంద్రబాబు చెప్పారు, మాఫీచేయాలని అనుకున్నారు
  • కానీ దానికి తగ్గ నిధుల్లేవు. ఆ నిధులు ఎలా సమీకరించాలన్నదే సమస్య
  • మలేషియా రాజధాని పుత్రజయను 8వేల ఎకరాల్లో ప్రారంభించారు
  • ఇప్పుడు 15 ఏళ్ల తర్వాత అది 16 వేల ఎకరాలకు విస్తరించింది
  • స్వచ్ఛందంగా భూములు ఇచ్చినవాళ్లు అలాగే నిలబడాలి
  • పోలవరం ప్రాజెక్టుకు వేలకోట్లు ఇస్తామని చెప్పి.. రూ. 100కోట్లే ఇచ్చారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement