పాలమూరు జి ల్లాలో పలు ఎత్తిపోతల సృష్టికర్త, అలా గే పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం రూపశిల్పి..రిటైర్డ్ ఇంజనీర్ అ లూపూర్ ధర్మారెడ్డి దశదినకర్మ ఆది వా రం మండల పరిధిలోని కల్వరాల గ్రా మంలో నిర్వహించనున్నరు. పాల మూ రు ఎత్తిపోతల పథకం రూపకల్పన.
పాన్‌గల్, న్యూస్‌లైన్: పాలమూరు జి ల్లాలో పలు ఎత్తిపోతల సృష్టికర్త, అలా గే పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం రూపశిల్పి..రిటైర్డ్ ఇంజనీర్ అ లూపూర్ ధర్మారెడ్డి దశదినకర్మ ఆది వా రం మండల పరిధిలోని కల్వరాల గ్రా మంలో నిర్వహించనున్నరు. పాల మూ రు ఎత్తిపోతల పథకం రూపకల్పన..అ నుమతులు, నిధులు సాధించేం దుకు అవిశ్రాంతంగా కృషిచేసిన ఆయ న అ నారోగ్యం కారణంగా ఈనెల 14వ తేదీ న హైదరాబాద్‌లో కనుమూశారు. మం డలంలోని కల్వరాల గ్రామంలో జ న్మిం చిన ధర్మారెడ్డి ఇరిగేషన్‌శాఖలో ఏఈగా పనిచేశారు. పదవీకాలం ముగిసిన నా టినుంచి తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ ఫోరంలో క్రియాశీలక పాత్ర పోషిం చారు. 2006 నుంచి పాలమూరు ఎత్తిపోతల పథకం కోసం ప్రతిపాదనలు కొ నసాగుతూనే ఉన్నాయి.
కల్వకుర్తి, నె ట్టెంపాడు, భీమా పథకాలను పరిశీ లిస్తూనే ఇంజనీర్స్ ఫోరం ఆధ్వర్యంలో జూరాల ప్రాజెక్టు నుంచి వరద జలాల్లో 70 టీఎంసీల నీటిని జిల్లాలోని షాద్‌నగర్ వరకు వివిధ దశల్లో ఎత్తిపోస్తూ మ హబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్గొండ జి ల్లాల్లోని 56 దుర్భిక్ష మండలాలకు నీ రివ్వగల పథకానికి రూపకల్పన చేశా రు. వీరిలో అగ్రగణ్యులు దివంగత ధ ర్మారెడ్డి. ఈ పథకం మొదట షాద్‌నగర్ ఎత్తిపోతలుగా మొదలై, పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతలుగా రూపుదాల్చిం ది. 2006- 2009 వరకు ఈ పథకంపై జరిగిన అన్ని పోరాటాల్లో ధర్మారెడ్డి పాల్గొన్నారు. 2009లో కొడంగల్ ఎన్నికల సభలో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హామీ ఇచ్చి న తరువాత, 2013 ఆగస్టు 8న జీఓ సా ధించేకునేవరకు ప్రతి కార్యక్రమంలో నూ ఆయన పాల్గొన్నారు.
అలాగే 2012 సెప్టెంబర్‌లో ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి మూడు రోజుల పా టు జిల్లాలో పర్యటించిన సమయంలో పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రయోజనాలపై సీఎంకు వివరించి అనుమతులు సాధించడంలో ఆయన సఫలీకృతులయ్యారు. ఆదివారం జరిగే వర్ధంతి కార్యక్రమానికి తెలంగాణ రిటైర్డు ఫోరం నాయకులు, పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్‌తో పాటు కొల్లాపూర్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు తదితరులు హాజరుకానున్నట్లు ధర్మారెడ్డి కుటుంబసభ్యులు తెలిపారు.