breaking news
Retired engineer
-
విజయవాడలో దారుణం.. ఇంటి ఓనర్‌ను పని మనిషే..
సాక్షి, విజయవాడ: నగరంలో దారుణం జరిగింది. ఆర్అండ్బి రిటైర్డ్ ఇంజనీర్ రామారావు అనుమానాస్పదంగా మృతి చెందారు. రామారావు ఇంట్లో కేర్ టేకర్‌గా పని చేస్తున్న మహిళే ఆయనను హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. కేర్ టేకర్ అనూషాతో పాటు మరో యువకుడు కలిసి ప్లాన్ చేసి హత్య చేసినట్లు పోలీసులు నిర్థారించారు. సీసీ కెమెరా ఫుటేజ్‌ల్లో అనుషతో పాటు మరో యువకుడు కదలికలను పోలీసులు గుర్తించారు. హత్య చేసిన తర్వాత అనూష నులకపేటలోని నివాసానికి వెళ్లినట్లు గుర్తించారు. అనూషతో పాటు మరో యువకుడు కోసం పోలీసులు గాలిస్తున్నారు.నగరంలోని మాచవరం పీఎస్ పరిధిలోని ఎన్టీఆర్ కాలనీలో బొద్దులూరి వెంకట రామారావు(70) తన తల్లి సరస్వతితో కలిసి నివాసం ఉంటున్నారు. రామారావు.. వృద్ధురాలైన తన తల్లిని చూసుకునేందుకు మూడు రోజుల క్రితం అనూష అనే యువతిని కేర్ టేకర్‌గా పెట్టుకున్నారు. ఆమె వారితో పాటే.. అదే ఇంట్లో నివాసం ఉంటోంది.శుక్రవారం అర్ధరాత్రి సమయంలో రామారావు గదిలో లైట్లు వెలగడంతో తల్లి సరస్వతి.. వెంటనే వచ్చి చూడగా మంచంపై కుమారుడు అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. ఆయన పడి ఉన్న మంచంపై కారం కూడా చల్లి ఉంది. కళ్లల్లో కారం కొట్టిన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మరో వైపు, బీరువా కూడా పగులగొట్టి ఉంది. ఇంటి పని మనిషి కూడా కనిపించకపోవడంతో అనుమానించిన తల్లి.. పక్క ఫ్లాట్ వాళ్లను పిలిచింది.వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. రామారావు నిద్రలో ఉండగా దిండుతో ఊపిరాడకుండా చేసి, కారం చల్లినట్లు పోలీసులు గుర్తించారు. మొదట ఆహారంలో మత్తు మందు కలిపి ఉంటారని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. కేర్ టేకర్ అనూష హత్య చేసినట్లు నిర్థారించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
పరమ శివయ్య ఇకలేరు
ప్రముఖ నీరావరి నిపుణులు, విశ్రాంత ఇంజనీర్ డాక్టర్ పరమశివయ్య (97) కన్నుమూశారు. మంగళవారం ఉదయం 11.40 గంటలకు ఆయనకు ఛాతిలో నొప్పి రావడంతో తుమకూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయనకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. ఆయన మరణవార్త తెలియగానే తుమకూరులోని పరమ శివయ్య స్వగృహానికి బంధువులు, వివిధ సంఘ సంస్థల నేతలు చేరుకున్నారు. అంతిమ దర్శనం చేసుకున్న వారిలో సిద్దగంగా మఠాధ్యక్షుడు శివకుమారస్వామిజీ, సిద్దలింగమహాస్వామీజీ, ఎంపీ జీఎస్.బసవరాజ్, విధానపరిషత్ సభ్యుడు డాక్టర్ ఎంఆర్ హులినాయ్కర్, ఎమ్మెల్యే డాక్టర్ రఫీక్ అహ్మద్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఎస్.షఫీ అహ్మద్ .. ఉన్నారు. నీరావరి పథకాలకు ఉన్నత స్థాయి కమిటీ అధ్యక్షుడిగా పరమ శివయ్య విధులు నిర్వహిస్తున్నారు. చిక్కబళ్లాపురం, కోలారు, బెంగళూరు గ్రామాంతర, గౌరిబిదనూరు, దొడ్డబళ్లాపురంతో పాటు తొమ్మిది జిల్లాలకు శాశ్వత నీటి సదుపాయం కల్పించడానికి పరమ శివయ్య ఓ నివేదికను తయారు చేసి 14 సంవత్సరాల కిందటే ప్రభుత్వానికి అందజేశారు. దాన్ని అమలు చేయాలంటూ నాటి నుంచి అనేక పోరాటాలు చేస్తూ బయలు సీమ జిల్లా ప్రజలకు ఆయన అత్యంత ప్రీతిపాత్రుడయ్యారు -
పాలమూరు ఎత్తిపోతల రూపశిల్పి ధర్మారెడ్డి
పాన్‌గల్, న్యూస్‌లైన్: పాలమూరు జి ల్లాలో పలు ఎత్తిపోతల సృష్టికర్త, అలా గే పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం రూపశిల్పి..రిటైర్డ్ ఇంజనీర్ అ లూపూర్ ధర్మారెడ్డి దశదినకర్మ ఆది వా రం మండల పరిధిలోని కల్వరాల గ్రా మంలో నిర్వహించనున్నరు. పాల మూ రు ఎత్తిపోతల పథకం రూపకల్పన..అ నుమతులు, నిధులు సాధించేం దుకు అవిశ్రాంతంగా కృషిచేసిన ఆయ న అ నారోగ్యం కారణంగా ఈనెల 14వ తేదీ న హైదరాబాద్‌లో కనుమూశారు. మం డలంలోని కల్వరాల గ్రామంలో జ న్మిం చిన ధర్మారెడ్డి ఇరిగేషన్‌శాఖలో ఏఈగా పనిచేశారు. పదవీకాలం ముగిసిన నా టినుంచి తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ ఫోరంలో క్రియాశీలక పాత్ర పోషిం చారు. 2006 నుంచి పాలమూరు ఎత్తిపోతల పథకం కోసం ప్రతిపాదనలు కొ నసాగుతూనే ఉన్నాయి. కల్వకుర్తి, నె ట్టెంపాడు, భీమా పథకాలను పరిశీ లిస్తూనే ఇంజనీర్స్ ఫోరం ఆధ్వర్యంలో జూరాల ప్రాజెక్టు నుంచి వరద జలాల్లో 70 టీఎంసీల నీటిని జిల్లాలోని షాద్‌నగర్ వరకు వివిధ దశల్లో ఎత్తిపోస్తూ మ హబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్గొండ జి ల్లాల్లోని 56 దుర్భిక్ష మండలాలకు నీ రివ్వగల పథకానికి రూపకల్పన చేశా రు. వీరిలో అగ్రగణ్యులు దివంగత ధ ర్మారెడ్డి. ఈ పథకం మొదట షాద్‌నగర్ ఎత్తిపోతలుగా మొదలై, పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతలుగా రూపుదాల్చిం ది. 2006- 2009 వరకు ఈ పథకంపై జరిగిన అన్ని పోరాటాల్లో ధర్మారెడ్డి పాల్గొన్నారు. 2009లో కొడంగల్ ఎన్నికల సభలో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హామీ ఇచ్చి న తరువాత, 2013 ఆగస్టు 8న జీఓ సా ధించేకునేవరకు ప్రతి కార్యక్రమంలో నూ ఆయన పాల్గొన్నారు. అలాగే 2012 సెప్టెంబర్‌లో ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి మూడు రోజుల పా టు జిల్లాలో పర్యటించిన సమయంలో పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రయోజనాలపై సీఎంకు వివరించి అనుమతులు సాధించడంలో ఆయన సఫలీకృతులయ్యారు. ఆదివారం జరిగే వర్ధంతి కార్యక్రమానికి తెలంగాణ రిటైర్డు ఫోరం నాయకులు, పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్‌తో పాటు కొల్లాపూర్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు తదితరులు హాజరుకానున్నట్లు ధర్మారెడ్డి కుటుంబసభ్యులు తెలిపారు.