కన్నుల పండువగా పద్మావతి పరిణయోత్సవం | padmavathi parinayotsavam in thirumala | Sakshi
Sakshi News home page

కన్నుల పండువగా పద్మావతి పరిణయోత్సవం

Apr 28 2015 12:45 AM | Updated on Sep 3 2017 12:59 AM

వైకుంఠపురంగా పిలివబడే గోవిందుని తిరుమలలో సోమవారం పద్మావతి పరిణయోత్సవం కన్నులపండువగా జరిగింది.

తిరుమల: వైకుంఠపురంగా పిలివబడే గోవిందుని తిరుమలలో సోమవారం పద్మావతి పరిణయోత్సవం కన్నులపండువగా జరిగింది. వివిధ రకాల ఫలాలు, అబ్బురపరిచే అందాలతో కూడిన పుష్పాలు సోయగాలతో పరిణయోత్సవ వేదికను తీర్చిదిద్దారు. మూడు రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు శ్రీవారి ఉత్సవర్లను మండపంలో కొలవుదీర్చి వైభవంగా ఉత్సవాన్ని నిర్వహించారు.


టీటీడీ ఉద్యానవనంలో ఆధ్వర్యంలో ప్రతి ఏడాది పద్మావతి పరిణయోత్సవ వేదికను శోభాయమానంగా తీరిదిద్దటం ఆనవాయితీ. గతంలో పసుపు-కుంకుమ మండపం, గాజుల మండపం, రంగురాళ్లు మండపం వంటి వివిధ నమూనలతో అలంకరించారు. అలాగే ఈ ఏడాది కూడా చెరుకు గడలు, మామిడి కాయలు- ఆకులు, కొబ్బరికాయలు, ఆపిల్, పైన్ ఆపిల్, దానిమ్మ, బత్తాయి పండ్లు, మొక్కజొన్న కుంకులు, రోజా, లిల్లీ, చామంతితో పాటు జాతుల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. కార్యక్రమంలో చివరిలో బాణసంచా వెలుగులు భక్తులను ఆకట్టుకున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement