breaking news
padmavathi parinayotsavam
-
తిరుమలలో వైభవంగా శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు
-
పద్మావతీ పరిణయోత్సవం ఏర్పాట్ల పరిశీలన
తిరుమల: తిరుమలలో మే 16వ తేదీ నుంచి నారాయణగిరి ఉద్యానవనంలో పద్మావతీ పరిణయోత్సవం జరగనుంది. ఈ నేపథ్యంలో పరిణయోత్సవం ఏర్పాట్లను శనివారం జేఈవో కె.శ్రీనివాసరాజు పరిశీలించారు. అలాగే శ్రీవారి దర్శనం కోసం భక్తుల రద్దీ బాగా పెరిగిపోయింది. కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో నిండిపోయి క్యూలో వెలుపలకు వచ్చారు. ఈ సందర్భంగా సిబ్బందితో కలసి జేఈవో తనిఖీలు నిర్వహించారు. భక్తుల సత్వర దర్శనానికి వీలుగా ఆయన పలు సూచనలు చేశారు. -
కన్నుల పండువగా పద్మావతి పరిణయోత్సవం
తిరుమల: వైకుంఠపురంగా పిలివబడే గోవిందుని తిరుమలలో సోమవారం పద్మావతి పరిణయోత్సవం కన్నులపండువగా జరిగింది. వివిధ రకాల ఫలాలు, అబ్బురపరిచే అందాలతో కూడిన పుష్పాలు సోయగాలతో పరిణయోత్సవ వేదికను తీర్చిదిద్దారు. మూడు రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు శ్రీవారి ఉత్సవర్లను మండపంలో కొలవుదీర్చి వైభవంగా ఉత్సవాన్ని నిర్వహించారు. టీటీడీ ఉద్యానవనంలో ఆధ్వర్యంలో ప్రతి ఏడాది పద్మావతి పరిణయోత్సవ వేదికను శోభాయమానంగా తీరిదిద్దటం ఆనవాయితీ. గతంలో పసుపు-కుంకుమ మండపం, గాజుల మండపం, రంగురాళ్లు మండపం వంటి వివిధ నమూనలతో అలంకరించారు. అలాగే ఈ ఏడాది కూడా చెరుకు గడలు, మామిడి కాయలు- ఆకులు, కొబ్బరికాయలు, ఆపిల్, పైన్ ఆపిల్, దానిమ్మ, బత్తాయి పండ్లు, మొక్కజొన్న కుంకులు, రోజా, లిల్లీ, చామంతితో పాటు జాతుల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. కార్యక్రమంలో చివరిలో బాణసంచా వెలుగులు భక్తులను ఆకట్టుకున్నాయి.