వృద్ధ దంపతుల దారుణహత్య | old couple murdered in krishna distirict | Sakshi
Sakshi News home page

వృద్ధ దంపతుల దారుణహత్య

Feb 14 2015 11:50 AM | Updated on Aug 21 2018 5:46 PM

కృష్ణా జిల్లా మోవ్వ మండలం భట్లపెనుమర్రు లో వృద్ధ దంపతులను శుక్రవారం రాత్రి గుర్తుతెలియని దుండగులు హత్యచేశారు.

కృష్ణా : కృష్ణా జిల్లా మోవ్వ మండలం భట్లపెనుమర్రు లో వృద్ధ దంపతులను శుక్రవారం రాత్రి గుర్తుతెలియని దుండగులు హత్యచేశారు. వివరాలు..స్థానిక గ్రామానికి చెందిన దంపతులు చలసాని వీరభద్రరావు(72), వెంకటరత్నం(63)  విజయవాడలో జరిగిన వారి మనవడి వివాహానికి హజరై శుక్రవారం రాత్రి ఇంటికి చేరుకున్నారు. ఈ క్రమంలో రాత్రి ఇంట్లోకి చొరబడిన దుండగులు వెంకటరత్నం తలపై కొట్టారు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. 

అంతేకాకుండా వీరభద్రారావును చంపి , నగ్నంగా వేరొక గదిలో పడేశారు. ఆయన మృతదేహం నగ్నంగా పడి ఉండటం, ఇంట్లోని వస్తువులు చిందరవందరగా  ఉండటంతో హత్యపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్తానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. దంపతుల మృతికి గల కారణాలు తెలియాల్సి ఉందని  పోలీసులు చెప్పారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
(మోవ్వ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement