శ్రమ దోపిడీ? | no proper salaries to labour | Sakshi
Sakshi News home page

శ్రమ దోపిడీ?

Aug 7 2013 3:49 AM | Updated on Aug 20 2018 9:16 PM

బీడీ కంపెనీలో పనిచేస్తున్న కార్మికులకు వెతలు తప్పడం లేదు. కొన్ని బీడీ కంపెనీల్లో నాలుగునెలలుగా వేతనాలు ఇవ్వడం లేదు. జిల్లా కేంద్రంతో పాటు ముబారక్‌నగర్, బాడ్సి, ధర్పల్లితో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన ఐదువేల మంది కార్మికులు పనిచేసే ఓ కంపెనీలో జీతాలు ఇవ్వడం లేదు

 దుబ్బ, న్యూస్‌లైన్ : బీడీ కంపెనీలో పనిచేస్తున్న కార్మికులకు వెతలు తప్పడం లేదు. కొన్ని బీడీ కంపెనీల్లో నాలుగునెలలుగా వేతనాలు ఇవ్వడం లేదు. జిల్లా కేంద్రంతో పాటు ముబారక్‌నగర్, బాడ్సి, ధర్పల్లితో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన ఐదువేల మంది కార్మికులు పనిచేసే ఓ కంపెనీలో జీతాలు ఇవ్వడం లేదు. వీరికి నెలలో 10 రోజులు మా త్రమే పని కల్పిస్తున్నారు. దీంతో కార్మికులు మిగిలిన రోజుల్లో పస్తులు ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. యాజమాన్యం కార్మికుల అవసరాన్ని ఆసరాగా చేసుకోని మిగిలిన 15 రోజులకు నాన్ పీఎఫ్ కింద పనిచేయిస్తున్నారు. 10 రోజుల పనికి రూ115 చెల్లిస్తుండగా, మిగి లిన 15 రోజులకు రూ90 చెల్లిస్తున్నారు. దీంతో కార్మికులు సగటున ప్రతిరోజు రూ20 వరకు నష్టపోతున్నారు. దీంతో రోజుకు యాజమాన్యానికి రూ12 లక్షల వరకు మిగులుతుంది. వాస్తవానికి కార్మికులకు చెందాల్సిన రూ12 లక్షలను యాజమాన్యం కార్మికులకు చెల్లించడం లేదు. 15 రోజులకు గాను సుమరు రూ2 కోట్ల వరకు కార్మికులకు చెల్లించాల్సినమొత్తాన్ని యాజమాన్యం దోపిడీకి పాల్పడుతుంది. వాస్తవానికి నెలకు 26 రోజుల పనికల్పించి జీవోనం 41 ప్రకారం వేతనాలు చెల్లించాలి.
 
 చట్టాలకు విరుద్ధంగా..
 కంపెనీ కార్మిక చట్టాలను పూర్తిగా విస్మరించింది. వీటికి తోడు యాజమాన్యాలు ఇచ్చే తూనికాకు తంబాకు కూడా సరిపోవడం లేదు. బయట కోనుగోళ్లు చేయాల్సి వస్తోందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారు లు కూడా చూసిచూడనట్లు వ్యవహరిం చడం ఫలితంగా బీడీ కంపెనీ యాజ మన్యాల దోపిడీకి అడ్డూఅదుపు లేకుం డాపోయింది. అధికారులు ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకోవాలని కార్మికులు కోరుతున్నారు.
 
 వేతనాలు చెల్లించాలి...
 నాలుగునెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో తీవ్ర ఇ బ్బందులు పడుతున్నాం. సమయాని కి వేతనాలు రాకపోవడంతో అప్పులు చే యాల్సి వస్తుంది. ధరలు పెరుగుతున్నా యి. కాని మాకు రావాల్సిన వేతనాలు అందడం లేదు.
 -భాగ్యలక్ష్మి, బీడీ కార్మికురాలు
 
 పదిరోజులే పని కల్పిస్తున్నారు...
 నెలకు పది రోజు ల పని మాత్రమే కల్పిస్తున్నారు. మి గిలిన రోజుల్లో పీ ఎఫ్ లేకుండా ప ని ఇస్తున్నారు. సేటును అడిగితే ఇది కూడా కావాలంటే చేసుకో, లేకపోతే పో అని అంటున్నారు. సమయానికి పైసలు కూడా ఇవ్వడం లేదు. ఇచ్చే తూనికా కు, తంబాకు కూడా సరిపోవడం లేదు.
 -లక్ష్మి, బీడీకార్మికురాలు
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement