శ్రీవారిని దర్శించుకున్న నిత్యానంద, రంజిత | nithyananda ,ranjitha Visit at tirumala srivaru | Sakshi
Sakshi News home page

శ్రీవారిని దర్శించుకున్న నిత్యానంద, రంజిత

Jun 19 2014 12:54 AM | Updated on Sep 2 2017 9:00 AM

శ్రీవారిని దర్శించుకున్న నిత్యానంద, రంజిత

శ్రీవారిని దర్శించుకున్న నిత్యానంద, రంజిత

వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద ధ్యాన పీఠాధిపతి నిత్యానంద స్వామి, ఆయన అంతరంగిక శిష్యురాలు, మాజీ నటి రంజిత బుధవారం తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఉ

 తిరుమల: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద ధ్యాన పీఠాధిపతి నిత్యానంద స్వామి, ఆయన అంతరంగిక శిష్యురాలు, మాజీ నటి రంజిత బుధవారం తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయం అనంతరం వీరు శిష్యబృందంతో కలసి ఆలయానికి వచ్చారు. అధికారులు వారికి ప్రత్యేక దర్శనం చేయించారు.

అనంతరం ఆలయం వద్ద మీడియా ఉండటాన్ని చూసిన రంజిత దూరంగా వెళ్లిపోయారు. చిత్రీకరిస్తున్న మీడియా సిబ్బందిని నిత్యానంద శిష్యబృందం ‘వద్దు..వద్దు..’ అంటూ అడ్డుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
 

Advertisement
 
Advertisement
Advertisement