విశాఖ నుంచి ఆస్ట్రేలియాకు విమానం | new airline service from vizag to australia | Sakshi
Sakshi News home page

విశాఖ నుంచి ఆస్ట్రేలియాకు విమానం

Apr 23 2015 8:36 PM | Updated on Sep 3 2017 12:45 AM

విశాఖ నుంచి ఆస్ట్రేలియాకు విమానం

విశాఖ నుంచి ఆస్ట్రేలియాకు విమానం

విశాఖ వైమానిక ప్రయాణీకులకు మరో తీపి కబురు. విదేశీ విమాన సదుపాయాలు రోజురోజుకీ అందుబాటులోకి వస్తున్నాయి.

విశాఖపట్నం (గోపాలపట్నం) : విశాఖ వైమానిక ప్రయాణీకులకు మరో తీపి కబురు. విదేశీ విమాన సదుపాయాలు రోజురోజుకీ అందుబాటులోకి వస్తున్నాయి. ఎయిర్ ఆసియా విమానసంస్ధ ఇప్పటికే మే7 నుంచి కౌలాలంపూర్‌కి విమాన సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా విశాఖ నుంచి ఆస్ట్రేలియాలో పెర్త్ విమానాశ్రయానికి మే 7 నుంచే విమాన సదుపాయాన్ని కల్పించడానికి ఏర్పాట్లు చేస్తోంది. దీని టికెట్ ధర రూ.12,500  ఉండొచ్చని సమాచారం.

ఇతర విమాన సంస్ధల పోటీకి ధీటుగా మరో అత్యాధునిక విమానం విశాఖ విమానాశ్రయానికి రాబోతుంది. ఇందుకోసం అన్ని హంగులతో సిద్ధమవుతున్న ఈ విమానం ప్రపంచంలోనే ఏడవ పెద్ద ఎయిర్‌లైన్స్‌గా విమాన వర్గాలు చెబుతున్నాయి. 800మంది వరకూ ప్రయాణించడానికి వీలుగా ఈ విమానం వుంటుందని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement