breaking news
new airline service
-
ఆకాశంలో ఇక ‘కొత్త విమానాలు’
దేశీ గగనతలంపై త్వరలో కొత్త ఎయిర్‌లైన్స్ రెక్కలు విప్పుకోనున్నాయి. ఇటీవలే ఇండిగో సంక్షోభంతో విమర్శలు ఎదుర్కొంటున్న ప్రభుత్వం.. ఈ రంగంలో పోటీని పెంచేందుకు వీలుగా రెండు కొత్త సంస్థల కార్యకలాపాలకు పచ్చజెండా ఊపింది.కేరళకు చెందిన అల్హింద్ గ్రూప్ కంపెనీ అల్ హింద్ ఎయిర్, ఫ్లైఎక్స్‌ప్రెస్ సంస్థలకు పౌర విమానయాన శాఖ నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) మంజూరు చేసింది. మరోవైపు ఇప్పటికే ఎన్వోసీని సొంతం చేసుకున్న శంఖ్ఎయిర్ సైతం 2026 మొదటి త్రైమాసికంలో కార్యకలాపాలు ప్రారంభించనున్నట్టు బుధవారం ప్రకటించింది.వచ్చే రెండు మూడేళ్లలో 20–25 ఎయిర్‌క్రాఫ్ట్‌లకు తమ సామర్థ్యాలను పెంచుకుంటామని సంస్థ చైర్మన్, ఎండీ శర్వణ్‌కుమార్ విశ్వకర్మ కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్‌నాయుడుతో భేటీ అనంతరం మీడియాకు తెలిపారు. దేశీయంగా 9 విమానయాన సంస్థలు సేవలు అందిస్తుండగా, ఇండిగో, ఎయిర్ఇండియా 90 శాతం వాటా కలిగి ఉన్నాయి.ఇప్పటికే ఎన్వోసీ పొందిన సంస్థలు తదుపరి దశలో ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికేట్ (ఏఓసీ) కోసం డీజీసీఏ నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో భద్రతా ప్రమాణాలు, పైలట్లు–సిబ్బంది శిక్షణ, విమానాల సమీకరణ, నిర్వహణ వ్యవస్థలపై కఠిన పరిశీలన జరుగుతుంది. అనుమతులు పూర్తయిన తర్వాత దేశీయ రూట్లతో పాటు మధ్యప్రాచ్యం, దక్షిణాసియా వంటి ప్రాంతాలకు అంతర్జాతీయ సేవలపై కూడా ఈ సంస్థలు దృష్టి పెట్టే అవకాశముంది. ముఖ్యంగా కేరళ కేంద్రంగా పనిచేసే సంస్థలు గల్ఫ్ దేశాలకు ప్రయాణికుల డిమాండ్‌ను లక్ష్యంగా చేసుకుంటున్నాయి.కొత్త ఎయిర్‌లైన్స్ రాకతో టికెట్ ధరల్లో పోటీ పెరిగి ప్రయాణికులకు మరిన్ని ఎంపికలు లభించనున్నాయని నిపుణులు భావిస్తున్నారు. అలాగే చిన్న నగరాలు, టైర్-2, టైర్-3 పట్టణాలకు కనెక్టివిటీ మెరుగుపడే అవకాశం ఉంది. ప్రభుత్వం ముందుకు తీసుకొస్తున్న ప్రాంతీయ విమానయాన పథకాలకు కూడా ఇవి తోడ్పడతాయని అంచనా. అదే సమయంలో ఇంధన ధరలు, విమానాల లీజింగ్ ఖర్చులు, నైపుణ్య సిబ్బంది కొరత వంటి సవాళ్లను కొత్త సంస్థలు ఎలా ఎదుర్కొంటాయన్నది ఆసక్తికరంగా మారింది. -
ఆకాశ వీధిలో ఝున్‌ఝున్‌వాలా
న్యూఢిల్లీ: దేశీ ఇన్వెస్ట్మెంట్ గురు రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా తాజాగా విమానయాన రంగంపై దృష్టి సారించారు. ఆకాశ ఎయిర్ పేరిట విమానయాన సంస్థను ప్రారంభిస్తున్నారు. పౌర విమానయాన శాఖ నుంచి దీనికి 15 రోజుల్లో అనుమతులు రావచ్చని ఝున్‌ఝున్‌వాలా వెల్లడించారు. కొత్త ఎయిర్‌లైన్ కోసం నాలుగేళ్లలో దాదాపు 70 విమానాలను సమకూర్చుకునే యోచనలో ఉన్నట్లు ఝున్‌ఝున్‌వాలా వివరించారు. 180 మంది ప్రయాణికుల సామర్థ్యం గల ఎయిర్‌క్రాఫ్ట్‌లను పరిశీలిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆకాశ ఎయిర్‌లో ఝున్‌ఝున్‌వాలా సుమారు 35 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనున్నారు. ఆయనకు ఇందులో 40 శాతం వాటాలు ఉండనున్నాయి. అత్యంత చౌక చార్జీల విమానయాన సంస్థగా ఉండబోయే ఆకాశ ఎయిర్ టీమ్‌లో డెల్టా ఎయిర్‌లైన్స్ సంస్థకి చెందిన మాజీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ కూడా ఉన్నారు. కరోనా వైరస్ కట్టడిపరమైన చర్యల కారణంగా దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా విమానయాన సంస్థలు సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటున్న తరుణంలో ఝున్‌ఝున్‌వాలా ఈ రంగంలోకి ప్రవేశించనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. దేశీయంగా కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ 2012లో మూతబడగా, జెట్ ఎయిర్వేస్ 2019లో దివాలా తీసింది. కొత్త యజమానుల సారథ్యంలో ప్రస్తుతం మళ్లీ ఎగిరే ప్రయత్నాల్లో ఉంది. థర్డ్ వేవ్ ముప్పు కూడా పొంచి ఉండటంతో దేశీ విమానయాన సంస్థల రికవరీకి మరింత సమయం పట్టేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో కొత్త విమానాల డెలివరీని కూడా వాయిదా వేసుకునేందుకు విమానయాన సంస్థ విస్తార.. ఎయిర్‌క్రాఫ్ట్‌ల తయారీ సంస్థలు బోయింగ్, ఎయిర్‌బస్‌లతో చర్చలు జరుపుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో విమానయాన రంగంలోకి ఝున్‌ఝున్‌వాలా ఆరంగేట్రం చర్చనీయాంశంగా మారింది. అయితే, ‘దేశీ విమానయాన రంగంలో డిమాండ్ విషయంలో నేను అత్యంత ఆశావహంగా ఉన్నాను‘ అని ఝున్‌ఝున్‌వాలా తెలిపారు. ఫోర్బ్స్ మేగజీన్ తాజా గణాంకాల ప్రకారం రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా సంపద విలువ సుమారు 4.6 బిలియన్ డాలర్లుగా ఉంటుంది. -
విశాఖ నుంచి ఆస్ట్రేలియాకు విమానం
విశాఖపట్నం (గోపాలపట్నం) : విశాఖ వైమానిక ప్రయాణీకులకు మరో తీపి కబురు. విదేశీ విమాన సదుపాయాలు రోజురోజుకీ అందుబాటులోకి వస్తున్నాయి. ఎయిర్ ఆసియా విమానసంస్ధ ఇప్పటికే మే7 నుంచి కౌలాలంపూర్‌కి విమాన సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా విశాఖ నుంచి ఆస్ట్రేలియాలో పెర్త్ విమానాశ్రయానికి మే 7 నుంచే విమాన సదుపాయాన్ని కల్పించడానికి ఏర్పాట్లు చేస్తోంది. దీని టికెట్ ధర రూ.12,500 ఉండొచ్చని సమాచారం. ఇతర విమాన సంస్ధల పోటీకి ధీటుగా మరో అత్యాధునిక విమానం విశాఖ విమానాశ్రయానికి రాబోతుంది. ఇందుకోసం అన్ని హంగులతో సిద్ధమవుతున్న ఈ విమానం ప్రపంచంలోనే ఏడవ పెద్ద ఎయిర్‌లైన్స్‌గా విమాన వర్గాలు చెబుతున్నాయి. 800మంది వరకూ ప్రయాణించడానికి వీలుగా ఈ విమానం వుంటుందని సమాచారం.


