‘ఆ బాధ నీలో స్పష్టంగా కనిపిస్తోంది కిట్టన్నా’ | MP Vijayasai Reddy Twitte On Andhra Jyothi Radhakrishna | Sakshi
Sakshi News home page

ఆ బాధ నీలో స్పష్టంగా కనిపిస్తోంది కిట్టన్నా’

Jun 7 2020 8:56 PM | Updated on Jun 7 2020 9:09 PM

MP Vijayasai Reddy Twitte On Andhra Jyothi Radhakrishna - Sakshi

సాక్షి, అమరావతి: ‘‘ఆంధ్రజ్యోతి కిట్టు గారూ.. జగన్ గారి ప్రభుత్వం ఏడాదిలోనే 90 శాతం హామీలను నెరవేర్చడంతో మీ పార్టనర్ చంద్రబాబుకు రాజకీయ జీవితం లేకుండాపోయిందన్న బాధ నీలో స్పష్టంగా కనిపిస్తోందంటూ’’ ట్విట్టర్‌ వేదికగా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి చురకలు అట్టించారు. ఈ కడుపుమంటకు మందు లేదని.. మీ రాతలు నమ్మడానికి 1980 నాటి రోజులు కావని గుర్తుంచుకో కిట్టన్నా’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ('కెలికి తిట్టించుకోవడం బాబుకు అలవాటే')

‘‘టీడీపీ - బీజేపీ పొత్తు గురించి నీకెందుకు అంత ఆత్రం. టీడీపీ కి తలుపులు శాశ్వతంగా మూసేశామని అమిత్ షా గారు పదే పదే చెప్పారు.  ఎన్నికలకు ముందు మోదీ తల్లిని, భార్యను సీబీఎన్‌ అసభ్యంగా అన్నమాటలను ఎవరూ మరిచిపోరమ్మా’’ అంటూ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు

‘‘వైఎస్సార్‌సీపీ ఎంపీల్లో అసమ్మతి అంటూ కట్టుకథలు, గాలి  పోగేసి  వార్తలు  తర్వాత రాసుకోవచ్చు.. ముందు మీ ఉద్యోగుల్లో అసమ్మతి పెరిగి, టీవీ రేటింగ్స్ పాతాళానికెళ్లాయి చూసుకోమ్మా’’ అంటూ  ఆయన ట్వీట్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement