‘గత వైఫల్యాలను ఆ పత్రిక రాస్తే బాగుంటుంది’ | Minister Kurasala Kannababu Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

వెనక్కి తగ్గకుండా హామీలు అమలు చేస్తున్నాం

Jul 12 2020 6:14 PM | Updated on Jul 12 2020 7:06 PM

Minister Kurasala Kannababu Comments On Chandrababu - Sakshi

సాక్షి, కాకినాడ: టీడీపీ హయాంలో రైతుల పట్ల సరైన విధానం పాటించలేదని, వారికి జరిగిన నష్టానికి చంద్రబాబే కారణమని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. ఆదివారం ఆయన తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసమే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పనిచేస్తున్నారని తెలిపారు. (అర్హులైన మహిళలందరికీ ‘వైఎస్సార్‌ చేయూత’)

రైతుల సంక్షేమం కోసం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుంటే, కొన్ని పత్రికల్లో చిత్ర విచిత్రమైన కథనాలు వస్తున్నాయని ఆయన మండిపడ్డారు. గత ఐదేళ్లలో చంద్రబాబు వైఫల్యాలపై ఈనాడు పత్రిక కథనాలు ప్రచురిస్తే బాగుంటుందన్నారు. రైతులకు ఇచ్చిన హామీలపై వెనక్కి తగ్గకుండా అమలు చేస్తున్నామని మంత్రి కన్నబాబు తెలిపారు. (వ్యవసాయాభివృద్ధిలో ఆర్‌బీకేలది కీలక భూమిక) 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement