25 లక్షల మంది మహిళలకు ఆర్థికసాయం

Samineni Udaya Bhanu Said Financial Assistance Would Be Given To Eligible Women - Sakshi

ప్రభుత్వ విప్‌ సామినేని ఉదయభాను

సాక్షి, కృష్ణా జిల్లా: అర్హులైన మహిళలకు ‘వైఎస్సార్‌ చేయూత’ ద్వారా ఆర్థిక సాయం అందిస్తామని ప్రభుత్వ విప్‌ సామినేని ఉదయభాను అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళల్లో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరుస్తామని పేర్కొన్నారు. 45 నుంచి 60 ఏళ్లలోపు మహిళలకు ఏడాదికి రూ.18,750 అందిస్తామని, నాలుగేళ్లలో రూ.75 వేలు ఆర్థిక సాయం చేస్తామని చెప్పారు. వైఎస్సార్‌ చేయూత ద్వారా 25 లక్షల మంది మహిళలు లబ్ధి పొందనున్నారని తెలిపారు. ఆగష్టు 12న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభిస్తారని వెల్లడించారు. అర్హులైన  పేద మహిళలను గుర్తించి వారికి ఆర్థికసాయం అందేలా చూడాలని వాలంటీర్లను సామినేని ఉదయభాను సూచించారు. (కరోనా పేషెంట్లకు అండగా ఉంటాం: మంత్రి)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top