వ్యవసాయాభివృద్ధిలో ఆర్‌బీకేలది కీలక భూమిక  | Kurasala Kannababu Kannababu Comments On Rythu Bharosa Centres | Sakshi
Sakshi News home page

వ్యవసాయాభివృద్ధిలో ఆర్‌బీకేలది కీలక భూమిక 

Jul 12 2020 4:36 AM | Updated on Jul 12 2020 4:36 AM

Kurasala Kannababu Kannababu Comments On Rythu Bharosa Centres - Sakshi

కాకినాడ రూరల్‌/సాక్షి, అమరావతి: రానున్న రోజుల్లో వ్యవసాయాభివృద్ధిలో రైతు భరోసా కేంద్రం (ఆర్‌బీకే)లు కీలక భూమిక పోషిస్తాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని తన క్యాంప్‌ కార్యాలయం నుంచి ‘అరటి సాగు – ప్రాముఖ్యత’అనే అంశంపై జూమ్‌ యాప్‌ ద్వారా శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పశ్చిమ గోదావరి జిల్లా వెంకట రామన్నగూడెంలోని డాక్టర్‌ వైఎస్సార్‌ ఉద్యాన వర్సిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో శాస్త్రవేత్తలు, అధికారులు, బెంగళూరులోని భారతీయ ఉద్యాన పరిశోధన సంస్థ సీనియర్‌ శాస్త్రవేత్తలతో పాటు ఆర్‌బీకేల్లో రైతులు పాల్గొన్నారు.

కన్నబాబు మాట్లాడుతూ.. నూతన వంగడాలను రూపొందించాలని శాస్త్రవేత్తలకు సూచించారు. ఉద్యాన పంటలకు హబ్‌గా రాయలసీమ అభివృద్ధి చెందాలని, ఈ దిశగా రైతులకు సూచనలు, సలహాలు ఇవ్వాలని ఉద్యాన వర్సిటీ శాస్త్రవేత్తలను కోరారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలను ప్రోత్సహించే నూతన విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం త్వరలో విడుదల చేస్తుందని చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement