ప్రజలకు మంచి చేసి తీరుతాము: కొడాలి నాని | Minister Kodali Nani Fires On Chandrababu | Sakshi
Sakshi News home page

జగన్‌ పాలనలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారు

May 30 2020 1:41 PM | Updated on May 30 2020 1:56 PM

Minister Kodali Nani Fires On Chandrababu - Sakshi

సాక్షి, గుడివాడ: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏడాది పరిపాలనలో ప్రజలంతా సుభిక్షంగా ఉన్నారని రాష్ట్ర పౌరసరఫరాల శాఖమంత్రి కొడాలి నాని అన్నారు. కృష్ణా జిల్లా గుడివాడ మార్కెట్‌ యార్డులో రైతు భరోసా కేంద్రాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వం రైతులను మోసం చేస్తే.. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అన్నదాతలకు భరోసాగా నిలిచిందన్నారు. మహానాడులో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై  టీడీపీ నేతలు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. (ఒకే ఒక్కడుగా నిలిచి... విజయపతాకం ఎగురవేసి...)

ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు.. జూమ్‌ యాప్‌ ద్వారా మహానాడు నిర్వహించి నాలుగు ఓట్లు సంపాదించడానికి తంటాలు పడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. న్యాయస్థానాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు వచ్చినా.. ప్రజలకు మంచి చేసి తీరుతామన్నారు. కింది న్యాయ స్థానంలో న్యాయం జరగకపోతే పై కోర్టుకు వెళ్తామని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. (ఆ అడుగుల సవ్వడి..)

Advertisement
 
Advertisement
Advertisement