సీఎం జగన్‌ మేలు మరిచిపోలేం: మంత్రి అనిల్‌ | Minister Anil Kumar Yadav Says Thanks To CM YS Jagan | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌కు రుణపడి ఉంటాం

Jun 16 2020 9:20 PM | Updated on Jun 16 2020 9:22 PM

Minister Anil Kumar Yadav Says Thanks To CM YS Jagan - Sakshi

సాక్షి, విజయవాడ: టీటీడీలో సన్నిధి యాదవులకు వంశపారంపర్య హక్కు కల్పించడం హర్షణీయం అని మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిలబెట్టుకున్నారని తెలిపారు. చట్టంలో సన్నిధి యాదవులని మార్చినందుకు రుణపడి ఉంటామని పేర్కొన్నారు. 1996లో టీడీపీ ప్రభుత్వం తొలగించిన వంశపారంపర్య విధానాన్ని సీఎం జగన్ అమలు చేశారని.. ఆయన కేబినెట్‌లో మంత్రిగా ఉండటం ఆనందంగా ఉందన్నారు. సీఎం జగన్‌ చేసిన మేలు ఎప్పటికీ మరిచిపోలేమన్నారు. (ఏపీ: కీలక బిల్లులకు అసెంబ్లీ ఆమోదం)

గతంలో సన్నిధి గొల్లలకు ఐదువేలు ఇచ్చేవారని, వైఎస్సార్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత వారి సమస్యలు తెలుసుకుని 18 వేలు పెంచారని తెలిపారు. టీటీడీలో వంశపారంపర్యం గా హక్కు ఇవ్వడంతో రాష్ట్రంలోని యాదవులంతా సీఎం జగన్‌కు రుణపడి ఉంటామన్నారు. ఇన్నేళ్లు తర్వాత వారికి మంచి చేసిన నాయకుడు సీఎం వైఎస్‌ జగన్‌ ఒక్కరేనని మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement