కడచూపూ దక్కలేదు | Married Woman Died With Heart Stroke in Prakasam | Sakshi
Sakshi News home page

కడచూపూ దక్కలేదు

Apr 16 2020 1:32 PM | Updated on Apr 16 2020 1:32 PM

Married Woman Died With Heart Stroke in Prakasam - Sakshi

సుధారాణి (ఫైల్‌)

ప్రకాశం, పొన్నలూరు: గుండెపోటుతో మృతి చెందిన వివాహిత భౌతిక కాయాన్ని స్వగ్రామానికి  తీసుకురాలేని విషాద ఘటన ఇది.. మండలంలోని కొత్తశింగరబొట్లపాలేనికి చెందిన మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు అప్పనబోయిన సుధారాణి (36) తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతిలో ఉంటోంది. ఆమె భర్త గోవిందరావు అక్కడే ఓ ప్రైవేట్‌ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడు. ఈ నెల 13వ తేదీన సుధారాణికి గుండెపోటు రావడంతో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. అయితే ఆమె భౌతిక కాయాన్ని కొత్తశింగరబొట్లపాలెం తీసుకొచ్చేందుకు అనుమతి లేక తిరుపతిలోనే అంత్యక్రియలు నిర్వహించారు. ఆమె కుటుంబ సభ్యులకు సెల్‌ఫోన్‌లో మృతదేహాన్ని, అంత్యక్రియల దృశ్యాన్ని చూపించి దహనం చేశారు. సుధారాణిని చివరిచూపు చూడలేక ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

Advertisement
 
Advertisement
Advertisement