భర్త చికెన్‌ తేలేదని వివాహిత ఆత్మహత్యాయత్నం | married woman committed suicide in Prakasam district | Sakshi
Sakshi News home page

భర్త చికెన్‌ తేలేదని వివాహిత ఆత్మహత్యాయత్నం

May 7 2018 8:52 AM | Updated on May 7 2018 8:52 AM

married woman committed suicide in Prakasam district - Sakshi

ప్రకాశం జిల్లా, మార్కాపురం: భర్త చికెన్‌ తేలేదని వివాహిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన ఆదివారం పట్టణంలోని ఎస్సీ, బీసీ కాలనీలో జరిగినట్లు ఎస్సై జి.కోటయ్య తెలిపారు. వివరాలు.. కాలనీలో నివాసం ఉండే లక్ష్మిదేవి తన భర్తను చికెన్‌ తేవాలని కోరగా ఆయన మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. క్షణికావేశానికి లోనైన లక్ష్మిదేవి ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుంది. వెంటనే కుటుంబ సభ్యులు గమనించి ఏరియా వైద్యశాలకు చికిత్స నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement