తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం ఉప్పాడలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు
ఉప్పాడలో వ్యక్తి అనుమానాస్పద మృతి
Jan 14 2016 12:12 PM | Updated on Sep 3 2017 3:41 PM
పిఠాపురం: తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం ఉప్పాడలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. వివరాలు.. ఉప్పాడ గ్రామానికి చెందిన గీతాల సత్యనారాయణ(35) అనే వ్యక్తి నక్కా శ్రీను, నక్కా కాసులు అనే ఇద్దరు వ్యక్తుల దగ్గర రూ. 45 వేలు అప్పు చేశాడు. ఎంతకీ బీకీ చెల్లించకపోవడంతో బుధవారం రాత్రి సత్యనారాయణను తీసుకొచ్చి తమ ఇంట్లో నిర్భంధించారు.
గురువారం ఉదయం చూసే సరికి నిర్జీవంగా పడి ఉన్నాడు. శ్రీను, కాసులు కలిసి సత్యనారాయణను చంపారని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తన్నారు.
Advertisement


