ఫైల్ ఫొటో
సాక్షి,కాకినాడ: పిఠాపురం జనసేన నేతలపై నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ ఆరోగ్యం ఎలా ఉందని ఎవరూ అడగడం లేదని అన్నారు. కాపు కార్పొరేషన్, కల్యాణ మండపం కావాలని అడుగుతారా? అని ప్రశ్నించారు. పవన్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకోరా? అంటూ మండిపడ్డారు. దీంతో నాగుబాబు మాటలకు జనసేన నేతలు సారీ చెప్పారు. జనసేన క్షమాపణలు చెప్పడంతో అదే కావలని నాగబాబు వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉండగా.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు శస్త్రచికిత్స జరిగింది. ఈ విషయాన్ని జనసేన పార్టీ ఎక్స్ పోస్ట్‌లో పేర్కొంది. గత వారం సడెన్‌గా పవన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొద్ది నెలలుగా ఆరోగ్యపరంగా ఇబ్బందిపడుతున్న ఆయన తన వ్యక్తిగత వైద్యుల సలహాతో ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలతోపాటు ఎం.ఆర్.ఐ. కూడా నిర్వహించారు. వాటిని పరిశీలించిన వైద్యులు శస్త్ర చికిత్స చేయవలసి ఉంటుందని నిర్ణయించి, శనివారం సాయింత్రం శస్త్రచికిత్స చేశారు.
వారం నుంచి పది రోజులపాటు విశ్రాంతి తర్వాత ఆయన అధికారిక కార్యక్రమాలలో పాల్గొనవచ్చని డాక్టర్లు తెలిపారు. అయితే దీర్ఘకాలం తగిన జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుందని, పూర్తి స్వస్థత చేకూరడానికి ఎక్కువ కాలం పడుతుందని డాక్టర్లు చెప్పారు. ఇదే విషయాన్ని పవన్ రాజకీయ కార్యదర్శి హరి ప్రసాద్ తెలిపారు. 2018లో పవన్ కల్యాణ్ కంటి సమస్యతో ఇబ్బంది పడ్డారు. ఆ సమయంలో హైదరాబాద్‌లోని ఎల్వీప్రసాద్ ఆసుపత్రిలో శస్త్ర చికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. పవన్ ఎడమ కంట్లో కురుపు ఉన్నట్లుగా గుర్తించిన వైద్యులు శస్త్రచికిత్సతో తొలగించారు. రంగస్థలం మూవీ సక్సెస్ మీట్‌లో ఈ విషయాన్ని పవన్ వెల్లడించారు.



