వివాహేతర సంబంధం బహిర్గతం కావడంతో .. | Man And Women commits suicide over illicit affair | Sakshi
Sakshi News home page

వివాహేతర సంబంధం బహిర్గతం కావడంతో ..

Sep 20 2018 8:35 AM | Updated on Sep 20 2018 8:41 AM

Man And Women commits suicide over illicit affair  - Sakshi

 శ్రీలక్ష్మిని రెండో పెళ్ళి చేసుకోవడానికి తిరుపతిరావు..

తిరువూరు : వివాహేతర సంబంధం బహిర్గతం కావడంతో కృష్ణా జిల్లా కోకిలంపాడుకు చెందిన యువతీ, యువకుడు బుధవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం ఆటో డ్రైవరుగా జీవనం సాగిస్తున్న జొన్నలగడ్డ తిరుపతిరావు (23) వివాహితుడు. ఒక కుమారుడు ఉన్నాడు. అదే గ్రామానికి చెందిన కొంగల శ్రీలక్ష్మి (19) అనే యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. శ్రీలక్ష్మిని రెండో పెళ్ళి చేసుకోవడానికి తిరుపతిరావు చేస్తున్న యత్నాలను అతని భార్య దీప్తి అంగీకరించకపోవడంతో కొద్ది రోజులుగా వివాదం తారాస్థాయికి చేరింది. పలుమార్లు పెద్దల సమక్షంలో, పోలీసు స్టేషన్లో పంచాయితీ జరిగింది. దీంతో ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం నీలాద్రి శివాలయానికి శ్రీలక్ష్మిని తీసుకెళ్ళి వివాహం చేసుకున్న తిరుపతిరావు అక్కడే పురుగుల మందును కూల్‌ డ్రింకులో కలుపుకుని తాగారు. అపస్మారక స్థితికి చేరిన ఇద్దరినీ పెనుబల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించేలోపు మృతి చెందారు. పెనుబల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement