నెల్లూరు జెడ్పీ ఎన్నికల సందర్భంగా జరిగిన అక్రమాలపై కోర్టును ఆశ్రయించిన న్యాయవాది సుధాకర్ రెడ్డిపై దాడి జరిగింది.
హైదరాబాద్: నెల్లూరు జెడ్పీ ఎన్నికల సందర్భంగా జరిగిన అక్రమాలపై కోర్టును ఆశ్రయించిన న్యాయవాది సుధాకర్ రెడ్డిపై దాడి జరిగింది. మంగళవారం సాయంత్రం హైకోర్టు నుంచి తిరిగి వస్తుండగా బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 1కు సమీపంలో ఆయన కారును అడ్డగించి దాడికి పాల్పడ్డారు.
మఫ్టీలో ఉన్న పోలీసులు తనపై దాడి చేశారని, వారిని గుర్తించానని సుధాకర్ రెడ్డి చెప్పారు. హైకోర్టులో కేసు ఎలా వాదిస్తావో చూస్తామంటూ బెదిరించారని తెలిపారు. నెల్లూరు రూరల్ డీఎస్పీ తీసుకురమ్మనారంటూ తనను లాక్కెల్లేందుకు ప్రయత్నించారని చెప్పారు. కాగా తన
స్నేహితుడు అరవడంతో వారు పారిపోయారని తెలిపారు. ప్రజాస్వామ్య విలువల కోసం పోరాడుతున్నందుకు తనపై దాడి చేశారని సుధాకర్ రెడ్డి అన్నారు.


