breaking news
Lawyer Sudhakar Reddy
-
నెల్లూరు జడ్పీటీసీలకు రక్షణ ఇవ్వండి: హైకోర్టు
-
నెల్లూరు జడ్పీటీసీలకు రక్షణ ఇవ్వండి: హైకోర్టు
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన జడ్పీటీసీ సభ్యులందరికీ అక్కడ జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎన్నిక ముగిసేవరకు పూర్తి రక్షణ కల్పించాలని ఆ జిల్లా ఎస్పీని హైకోర్టు ఆదేశించింది. ఈనెల 20వ తేదీన ఎన్నిక ఉండటంతో తమను అరెస్టు చేయరాదంటూ కొంతమంది జడ్పీటీసీ సభ్యులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారించిన ధర్మాసనం.. పై విధంగా తీర్పునిచ్చింది. ఎస్పీ కార్యాలయం నుంచి జిల్లా పరిషత్ హాలు వరకు ఎస్పీ సమక్షంలో వారికి రక్షణ కల్పించాలని కోర్టు ఆదేశించింది. ఎన్నికలు ముగిసేవరకు జడ్పీటీసీ సభ్యులెవరినీ అరెస్టు చేయరాదని న్యాయమూర్తులు చెప్పినట్లు హైకోర్టు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి తెలిపారు. జడ్పీటీసీ సభ్యులు కూడా ఎవరికి కేటాయించిన సీట్లలో వాళ్లే కూర్చోవాలని, అలా చేయనిపక్షంలో వాళ్లు ఓట్లు వేయడానికి వీల్లేదని కూడా హైకోర్టు స్పష్టం చేసింది. -
న్యాయవాదిపై మఫ్టీ పోలీసుల దాడి!
హైదరాబాద్: నెల్లూరు జెడ్పీ ఎన్నికల సందర్భంగా జరిగిన అక్రమాలపై కోర్టును ఆశ్రయించిన న్యాయవాది సుధాకర్ రెడ్డిపై దాడి జరిగింది. మంగళవారం సాయంత్రం హైకోర్టు నుంచి తిరిగి వస్తుండగా బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 1కు సమీపంలో ఆయన కారును అడ్డగించి దాడికి పాల్పడ్డారు. మఫ్టీలో ఉన్న పోలీసులు తనపై దాడి చేశారని, వారిని గుర్తించానని సుధాకర్ రెడ్డి చెప్పారు. హైకోర్టులో కేసు ఎలా వాదిస్తావో చూస్తామంటూ బెదిరించారని తెలిపారు. నెల్లూరు రూరల్ డీఎస్పీ తీసుకురమ్మనారంటూ తనను లాక్కెల్లేందుకు ప్రయత్నించారని చెప్పారు. కాగా తన స్నేహితుడు అరవడంతో వారు పారిపోయారని తెలిపారు. ప్రజాస్వామ్య విలువల కోసం పోరాడుతున్నందుకు తనపై దాడి చేశారని సుధాకర్ రెడ్డి అన్నారు.


