నెల్లూరు జడ్పీటీసీలకు రక్షణ ఇవ్వండి: హైకోర్టు | high court orders to protect zptc members | Sakshi
Sakshi News home page

నెల్లూరు జడ్పీటీసీలకు రక్షణ ఇవ్వండి: హైకోర్టు

Jul 18 2014 3:54 PM | Updated on Aug 31 2018 8:26 PM

నెల్లూరు జడ్పీటీసీలకు రక్షణ ఇవ్వండి: హైకోర్టు - Sakshi

నెల్లూరు జడ్పీటీసీలకు రక్షణ ఇవ్వండి: హైకోర్టు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన జడ్పీటీసీ సభ్యులందరికీ అక్కడ జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎన్నిక ముగిసేవరకు పూర్తి రక్షణ కల్పించాలని ఆ జిల్లా ఎస్పీని హైకోర్టు ఆదేశించింది.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన జడ్పీటీసీ సభ్యులందరికీ అక్కడ జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎన్నిక ముగిసేవరకు పూర్తి రక్షణ కల్పించాలని ఆ జిల్లా ఎస్పీని హైకోర్టు ఆదేశించింది. ఈనెల 20వ తేదీన ఎన్నిక ఉండటంతో తమను అరెస్టు చేయరాదంటూ కొంతమంది జడ్పీటీసీ సభ్యులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారించిన ధర్మాసనం.. పై విధంగా తీర్పునిచ్చింది.

ఎస్పీ కార్యాలయం నుంచి జిల్లా పరిషత్ హాలు వరకు ఎస్పీ సమక్షంలో వారికి రక్షణ కల్పించాలని కోర్టు ఆదేశించింది. ఎన్నికలు ముగిసేవరకు జడ్పీటీసీ సభ్యులెవరినీ అరెస్టు చేయరాదని న్యాయమూర్తులు చెప్పినట్లు హైకోర్టు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి తెలిపారు. జడ్పీటీసీ సభ్యులు కూడా ఎవరికి కేటాయించిన సీట్లలో వాళ్లే కూర్చోవాలని, అలా చేయనిపక్షంలో వాళ్లు ఓట్లు వేయడానికి వీల్లేదని కూడా హైకోర్టు స్పష్టం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement