'స్థలాలు ఆక్రమిస్తున్న కేశినేని నాని' | kesineni nani trying to encroach lands | Sakshi
Sakshi News home page

'స్థలాలు ఆక్రమిస్తున్న కేశినేని నాని'

Oct 21 2014 7:04 PM | Updated on May 25 2018 7:29 PM

'స్థలాలు ఆక్రమిస్తున్న కేశినేని నాని' - Sakshi

'స్థలాలు ఆక్రమిస్తున్న కేశినేని నాని'

ఎంపీ కేశినేని నాని స్థలాలు ఆక్రమిస్తే, ఎమ్మెల్యే బోడే ప్రసాద్ నకిలీ వ్యక్తులతో ఇంటర్ పరీక్షలు రాయిస్తున్నారని అంబటి రాంబాబు మండిపడ్డారు.

గుంటూరు: ప్రజలను మోసం చేయాలనే తప్ప వారికి సేవ చేద్దామన్న ఆలోచన సీఎం చంద్రబాబుకు లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. రైతు సాధికార సంస్థకు కేటాయించిన రూ.5 వేల కోట్లు ఏ మూలకు సరిపోతాయని ఆయన ప్రశ్నించారు. రూ.87 వేల కోట్లు అప్పులుంటే అందులో నాలుగోవంతు వడ్డీ కూడా కేటాయించలేదన్నారు.

సీఎం అసమర్థత వల్ల రైతులు బీమా సౌకర్యం కోల్పోయారన్నారు. స్త్రీ శక్తిని తక్కువ అంచనా వేస్తూ డ్వాక్రా రుణాలు కూడా మాఫీ చేయడం లేదని విమర్శించారు. నారావారు..నారాసురుడా లేక నరకాసురుడా అని ప్రశ్నించారు. కడుపుమండిన రైతులు, స్త్రీశక్తిని ఎదుర్కొక తప్పదన్నారు.

టీడీపీ నేతల అరాచకాలు మరీ పెట్రేగిపోతున్నాయన్నారు. ఎంపీ కేశినేని నాని స్థలాలు ఆక్రమిస్తే, ఎమ్మెల్యే బోడే ప్రసాద్ నకిలీ వ్యక్తులతో ఇంటర్ పరీక్షలు రాయిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, టీడీపీ నాయకులు తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని రాంబాబు హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement