శ్రీవారి ఆలయంలో కైశిక ద్వాదశి ఆస్థానం | kaisika Dwadashi court in Srivari temple | Sakshi
Sakshi News home page

శ్రీవారి ఆలయంలో కైశిక ద్వాదశి ఆస్థానం

Nov 23 2015 7:00 PM | Updated on Sep 3 2017 12:54 PM

తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం కైశిక ద్వాదశి ఆస్థానం నిర్వహించారు.

తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం కైశిక ద్వాదశి ఆస్థానం నిర్వహించారు. ఇందులో భాగంగా స్వామివారికి సుప్రభాతం, అర్చన, తోమాల సేవలను ఏకాంతంగా నిర్వహించారు. ఉదయం 4.30 నుంచి 5.30 గంటల మధ్య శ్రీదేవి, భూదేవి సమేత ఉగ్రశ్రీనివాసమూర్తి పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం అర్చకులు పురాణ పఠనంతో కైశిక ద్వాదశి ఆస్థానాన్ని ఘనంగా నిర్వహించారు.

ఏడాదిలో ఈ ఒక్కరోజు మాత్రమే ఉగ్రశ్రీనివాసమూర్తి ఆలయ వీధుల్లో ఊరేగుతారు. కైశిక ద్వాదశిని ప్రభోదోత్సవం, ఉత్తాన ద్వాదశి అని కూడా వ్యవహరిస్తారు. స్థితికారుడైన మహావిష్ణువును మేల్కొల్పే పర్వదినంగా పరిగణిస్తారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో దొండపాటి సాంబశివరావు దంపతులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement