ఉగ్రవాదుల కాల్పుల్లో బొబ్బిలి జవాన్ మృతి | Jawan killed in a terrorist shooting | Sakshi
Sakshi News home page

ఉగ్రవాదుల కాల్పుల్లో బొబ్బిలి జవాన్ మృతి

Oct 5 2015 5:31 PM | Updated on Jul 12 2019 3:10 PM

జమ్మూ కాశ్మీర్ సరిహద్దులో ఆదివారం అర్థరాత్రి జరిగిన ఉగ్రవాదుల దాడిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక జవాన్ మృతి చెందాడు.

జమ్మూ కాశ్మీర్ సరిహద్దులో ఆదివారం అర్థరాత్రి జరిగిన ఉగ్రవాదుల దాడిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక జవాన్ మృతి చెందాడు. విజయనగరం జిల్లా బాడంగి మండలం గొల్లాది గ్రామానికి చెందిన బొత్త సత్యం(36) సరిహద్దు భద్రతా దళంలో జవాన్‌గా పనిచేస్తున్నాడు.

ఆదివారం అర్థరాత్రి ఉగ్రవాదుల దాడిలో మరణించాడని.. కుటుంబ సభ్యులకు సోమవారం మధ్యాహ్నం సమాచారం అందింది. బొత్త సత్యంకు బొబ్బిలికి చెందిన శ్రీవాణితో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. సత్యం మృతదేహం మూడు రోజుల తర్వాత స్వగ్రామానికి వస్తుందని అధికారులు తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement