శిశువు మృతి : ఆసుపత్రి వద్ద బంధువుల ఆందోళన | Infant baby die in govt maternity hospital tirupati | Sakshi
Sakshi News home page

శిశువు మృతి : ఆసుపత్రి వద్ద బంధువుల ఆందోళన

Jan 6 2015 10:41 AM | Updated on Sep 28 2018 3:39 PM

తిరుపతి నగరంలోని మెటర్నటి ఆసుపత్రిలో అప్పుడే పుట్టిన శిశువు మృతి చెందింది.

తిరుపతి: తిరుపతి నగరంలోని మెటర్నటి ఆసుపత్రిలో అప్పుడే పుట్టిన శిశువు మృతి చెందింది. దాంతో బాలింత బంధువులు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ దారుణం జరిగిందని ఆమె బంధువులు ఆరోపించారు. దాంతో శిశువు మృతదేహంతో వారు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు రంగ ప్రవేశం చేసి... బాలింత బంధువులను శాంతింప చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement