ఇంద్రకీలాద్రి ఈవోగా సూర్యకుమారి | IAS officer appointed vijayawada kanaka durga temple EO | Sakshi
Sakshi News home page

ఇంద్రకీలాద్రి ఈవోగా సూర్యకుమారి

Jul 2 2016 7:09 PM | Updated on Sep 4 2017 3:59 AM

ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం నూతన పాలనాధికారి (ఈవో)గా ఐఏఎస్ అధికారణి సూర్యకుమారి నియ‌మితుల‌య్యారు.

విజయవాడ: ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం నూతన పాలనాధికారి (ఈవో)గా ఐఏఎస్ అధికారణి సూర్యకుమారి నియ‌మితుల‌య్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2008 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన సూర్యకుమారి నియమించారు.  ప్రస్తుతం సూర్యకుమారి ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ గా ఉన్నారు.

కాగా కృష్ణా పుష్కరాల నిర్వహణను ఏపీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆమెను దేవాదాయ శాఖకు బదిలీ చేస్తూ ఇంద్రకీలాద్రి ఈవోగా నియమించింది. మరోవైపు కృష్ణా పుష్కరాల ప్రత్యేక అధికారిగా ఐఏఎస్ అధికారి బి.రాజశేఖర్ ను నియమించింది.

 

Advertisement
 
Advertisement
Advertisement