breaking news
temple executive officer
-
ఇంద్రకీలాద్రి ఈవోగా సూర్యకుమారి
విజయవాడ: ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం నూతన పాలనాధికారి (ఈవో)గా ఐఏఎస్ అధికారణి సూర్యకుమారి నియమితులయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2008 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన సూర్యకుమారి నియమించారు. ప్రస్తుతం సూర్యకుమారి ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ గా ఉన్నారు. కాగా కృష్ణా పుష్కరాల నిర్వహణను ఏపీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆమెను దేవాదాయ శాఖకు బదిలీ చేస్తూ ఇంద్రకీలాద్రి ఈవోగా నియమించింది. మరోవైపు కృష్ణా పుష్కరాల ప్రత్యేక అధికారిగా ఐఏఎస్ అధికారి బి.రాజశేఖర్ ను నియమించింది. -
దుర్గగుడి ఈవోగా మళ్లీ నర్సింగరావు !
విజయవాడ : దుర్గగుడి కార్యనిర్వహణాధికారిగా సీహెచ్ నర్సింగరావు తిరిగి రానున్నారని ఇంద్రకీలాద్రి పై ప్రచారం జరుగుతోంది. ఈవో వేధింపుల కారణంగా దుర్గగుడి అర్చకుడు సుబ్బారావు అనారోగ్యం పాలయ్యారని ఇటీవల అర్చకులంతా ధర్నా చేసిన విషయం విదితమే. దీనికి తోడు తన కుమారుడి వివాహం ఉండటంతో ఈ నెల 10న సీహెచ్ నర్సింగరావు సెలవు పై వెళ్లారు. ఆయన తిరిగి 31న విధుల్లో చేరాల్సి ఉంది. అయితే నర్సింగరావు స్థానంలో చంద్ర శేఖర్ ఆజాద్ ఈవో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నర్సింగరావు తిరిగి వస్తే ఆయనకు బాధ్యతలు అప్పగించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం. నాకు సమాచారం లేదు తన సెలవు పూర్తవగానే దేవాదాయశాఖ కమిషనర్‌కు జాయినింగ్ ఆర్డర్ పంపుతానని, ప్రభుత్వం ఎక్కడ పోస్టింగ్ ఇస్తే అక్కడ చేరతానని నర్సింగరావు మంగళవారం తెలి పారు. తిరిగి దేవస్థానం ఈవోగా రావడం పై తనకు ఇప్పటి వరకు స్పష్టమైన ఆదేశాలు రాలేదని చెప్పారు. ఎక్కడ పోస్టింగ్ ఇచ్చినా చేస్తానని పేర్కొన్నారు. అర్చకుడు సుబ్బారావు కోలుకున్నారని సిబ్బంది ద్వారా తెలిసి చాలా సంతోషించానని తెలిపారు.