'ప్రతి విషయంలోనూ తెలంగాణ గిల్లికజ్జాలు' | hyderabad is common capital for two states, says chandra babu | Sakshi
Sakshi News home page

'ప్రతి విషయంలోనూ తెలంగాణ గిల్లికజ్జాలు'

Jun 27 2015 2:28 PM | Updated on Aug 11 2018 7:06 PM

'ప్రతి విషయంలోనూ తెలంగాణ గిల్లికజ్జాలు' - Sakshi

'ప్రతి విషయంలోనూ తెలంగాణ గిల్లికజ్జాలు'

తెలంగాణ ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు.

విజయవాడ: తెలంగాణ ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. విజయవాడలో శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి విషయంలోనూ ఏపీ ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వం గిల్లికజ్జాలు పెట్టుకుంటోందంటూ ఆయన విమర్శించారు. సెక్షన్ -8 పై అధికారాలన్నీ గవర్నర్ వేనని, హైదరాబాద్లో తెలంగాణ సీఎం కేసీఆర్ పెత్తనమెంటని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

రెండు రాష్ట్రాలకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అన్న విషయాన్ని కేసీఆర్ గుర్తుపెట్టుకోవాలని ఆయన అన్నారు. మా ఆత్మగౌరవానికి ఇబ్బంది కలిగితే రాజీపడే ప్రసక్తే లేదని చంద్రబాబు పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement