పెళ్లీడుకొచ్చిన పిల్లలు ఉన్నారు.. తాగి వస్తే ఎలా.. | Husbend kills his wife | Sakshi
Sakshi News home page

పెళ్లీడుకొచ్చిన పిల్లలు ఉన్నారు.. తాగి వస్తే ఎలా..

Jul 9 2017 3:15 PM | Updated on Jul 30 2018 8:37 PM

పెళ్లీడుకొచ్చిన పిల్లలు ఇంట్లో ఉన్నారు రోజు తాగి వస్తే ఎలా అని ప్రశ్నించినందుకు భార్యను దారుణంగా నరికి చంపాడు ఆమె భర్త.

ఆలూరు:  పెళ్లీడుకొచ్చిన పిల్లలు ఇంట్లో ఉన్నారు రోజు తాగి వస్తే ఎలా అని ప్రశ్నించినందుకు భార్యను దారుణంగా నరికి చంపాడు ఆమె భర్త. ఈ ఘటన కర్నూలు జిల్లా ఆలహారిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కురుమ మాలమ్మ(55), కురుమ గాదెప్ప(60) భార్యాభర్తలు. గాదెప్ప రోజూ మద్యం తాగి ఇంట్లో బీభత్సం సృష్టించేవాడు.

ఆదివారం మధ్యాహ్నాం మద్యం మత్తులో ఇంటికి వచ్చిన గాదెప్పను మాలమ్మ నిలదీసింది. దీంతో ఆవేశానికి గురైన గాదెప్ప గొడ్డలితో  కిరాతకంగా ఆమెను నరికి చంపాడు . తీవ్రగాయాలతో మాలమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. ఈ విషయం తెలిసిన ఆలహారి ఎస్‌ఐ కృష్ణమూర్తి సంఘటనాస్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement