నచ్చిన కూర వండలేదని.. | Husband kills wife | Sakshi
Sakshi News home page

నచ్చిన కూర వండలేదని..

Mar 29 2016 6:10 PM | Updated on Jul 30 2018 8:29 PM

నచ్చిన కూర వండలేదనే కారణంతో ఓ భర్త కట్టుకున్న భార్యను కడతేర్చాడు.

పార్వతీపురం (విజయనగరం జిల్లా) : నచ్చిన కూర వండలేదనే కారణంతో ఓ భర్త కట్టుకున్న భార్యను కడతేర్చాడు. గుమ్మలక్ష్మీపురం మండలం దేరుపాడు పంచాయతీ అచ్చిబ గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా మంగళవారం సాయంత్రం వెలుగులోకి వచ్చింది. సోమవారం రాత్రి నచ్చిన కూర వండలేదని కోలక లక్ష్మమ్మ(50) అనే మహిళను ఆమె భర్త లక్ష్మణరావు కర్రతో కొట్టి చంపాడు. అనంతరం పరారయ్యాడు. బంధువులు ఆమె మృతదేహాన్ని పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement