వరద ఉధృతి.. 40 గేట్ల ఎత్తివేత | Heavy Floods At Prakasam Barrage | Sakshi
Sakshi News home page

వరద ఉధృతి.. 40 గేట్ల ఎత్తివేత

Aug 12 2018 1:00 PM | Updated on Aug 12 2018 1:05 PM

Heavy Floods At Prakasam Barrage - Sakshi

బ్యారేజ్‌ పూర్తిగా నిండడంతో పట్టిసీమ పంపులను అధికారులు నిలిపివేశారు.

సాక్షి, కృష్ణా : ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రకాశం బ్యారేజ్‌కి వరద పోటెత్తుతోంది. దీంతో బ్యారేజ్‌లో జలకల సంతరించుకుంది. మున్నేర, పాలేరు నుంచి వరద వచ్చిచేరుతుండంతో ప్రకాశం బ్యారేజ్‌ నిండుకుండలా మారింది. వరద ఉధృతి మరింత పెరగడంలో 40 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఇప్పటివరకు 29వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలారు. బ్యారేజ్‌ పూర్తిగా నిండడంతో పట్టిసీమ పంపులను అధికారులు నిలిపివేశారు.

ప్రధాన కాలువ నుంచి 30 వేల క్యూసెక్కుల నీటిని సాగునీరు కొరకు విడుదల చేశారు. రానున్న 24 గంటల్లో భారీ వర్ష సూచన ఉండడంతో, వరద ఉధృతి మరింతే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీంతో లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement