ఉధృతంగా గోదావరి.. | Godhavari water releases to Sea  | Sakshi
Sakshi News home page

ఉధృతంగా గోదావరి..

Aug 22 2018 12:29 PM | Updated on Aug 22 2018 12:37 PM

Godhavari water releases to Sea  - Sakshi

సాక్షి, అమరావతి : ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి వరద ఉధృతి కొనసాగుతోంది. నీటిమట్టం 15.2 అడుగులకు చేరుకుంది. 15 లక్షల 9 వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి అధికారులు విడుదల చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలోని కొత్తపేట మండలం నారాయణ లంక, అద్దంకివారి లంక, రావులపాలెం మండలం తోక లంక గ్రామాలకు వరద పోటెత్తడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అయినవిల్లి మండలం కొండుకుదురులంక, పొట్టిలంక గ్రామాలు వరద ముంపునీటిలో చిక్కుకున్నాయి. రాకపోకలు నిలిచిపోవడంతో నిత్యావసర సరకుల కోసం జనం అల్లాడుతున్నారు. 

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం గుండిమెడ వద్ద కృష్ణానదిలో ఈత కొట్టేందుకు వెళ్లిన ఐదుగురు విద్యార్థుల్లో నలుగురు గల్లంతయ్యారు. గల్లంతయిన విద్యార్థులు చిర్రావూరుకు చెందిన శివ, శశి, దినేష్, క్రాంతికుమార్లుగా గుర్తించారు. వీరి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement