కోల్‌కతాకు బయలుదేరిన మంత్రి గంటా | Ganta srinivasa rao going to kolkata | Sakshi
Sakshi News home page

కోల్‌కతాకు బయలుదేరిన మంత్రి గంటా

Aug 4 2014 9:34 AM | Updated on Oct 5 2018 6:48 PM

మంత్రి గంటా శ్రీనివాసరావు సోమవారం ఉదయం కోల్‌కతాకు బయలుదేర్దారు.

విశాఖ : మంత్రి గంటా శ్రీనివాసరావు సోమవారం ఉదయం కోల్‌కతాకు బయలుదేర్దారు. తీర్థయాత్రలకు వెళ్లి విషాహారం తిని అస్వస్థతకు గురైన తెలుగు వారిని ఆయన పరామర్శించనున్నారు. మరోవైపు ప్రకాశం జిల్లా కలెక్టర్ జీఎస్ఆర్కే ఆర్ విజయకుమార్ అస్వస్థతకు గురైన వారికి వైద్యం అందుతున్న తీరుపై కోల్కతా జాయింట్ కలెక్టర్తో ఫోన్లో మాట్లాడారు.

 

యాత్రికులకు ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. కాగా కోల్‌కతాలో అస్వస్థతకు గురైన వారికి అక్కడి అపోలో ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నామని, ప్రభుత్వ ఖర్చులతో స్వస్థలాలకు చేరుస్తామని  మంత్రి పి.నారాయణ తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement