రోడ్డుప్రమాదంలో రైతు మృతి | farmer ramanjaneyulu died in a road accident in ananthapur district | Sakshi
Sakshi News home page

రోడ్డుప్రమాదంలో రైతు మృతి

Sep 18 2015 4:41 PM | Updated on Oct 1 2018 4:01 PM

గ్రామ దేవతకు పూజలు చేసి బైక్ పై వెళ్తున్న ఓ రైతు ఆగి ఉన్న వాహనాన్ని ప్రమాదవశాత్తు ఢీకొట్టి ప్రాణాలు కోల్పోయాడు.

పామిడి(అనంతపురం): గ్రామ దేవతకు పూజలు చేసి బైక్ పై వెళ్తున్న ఓ రైతు ఆగి ఉన్న వాహనాన్ని ప్రమాదవశాత్తు ఢీకొట్టి ప్రాణాలు కోల్పోయాడు. అనంతపురం జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. గుంతకల్లుకు చెందిన రామాంజనేయులు(46)కు పామిడి మండలం పాళ్యం వద్ద పొలాలున్నాయి. ఏటా వానాకాలంలో కుటుంబం సహా వచ్చి పొలంలోని దేవతకు పూజలు చేయటం ఆనవాయితీ.

అందులో భాగంగానే శుక్రవారం ఉదయం కుటుంబసభ్యులంతా ఆటోలో పొలానికి చేరుకోగా రామాంజనేయులు బైక్‌పై వచ్చారు. తిరుగు ప్రయాణంలో రామాంజనేయులు ఎద్దులపల్లి వద్ద ప్రమాదవశాత్తు ఆగి ఉన్న బైక్‌ను ఢీకొట్టాడు. దీంతో తీవ్రగాయాలపాలైన ఆయన అక్కడికక్కడే చనిపోయాడు. ఆయనకు భార్య ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement