విద్యుత్ షాక్‌తో రైతు మృతి | Farmer Died Due to Electric in Anantapur | Sakshi
Sakshi News home page

విద్యుత్ షాక్‌తో రైతు మృతి

May 28 2018 10:58 AM | Updated on Oct 1 2018 2:44 PM

Farmer Died Due to Electric in Anantapur - Sakshi

సాయినాథ్ మృతదేహం(ఫైల్‌)

సాక్షి, అనంతపురం : జిల్లాలోని సింగనమల మండలం తరిమెల గ్రామంలో సోమవారం ఉదయం విద్యుత్‌ షాక్‌కొట్టి ఓ రైతు మృతిచెందాడు. వివరాల్లోకి వెళితే.. తరిమెల గ్రామానికి చెందిన సాయినాథ్ వ్యక్తి వ్యవసాయంతోపాటు మోటర్ మెకానిక్‌గా కూడా పని చేస్తున్నాడు. అందులో భాగంగా ఈ రోజు వారి పొలంలో ఉన్న విద్యుత్తు స్తంభం ఎక్కి విద్యుత్తు వైర్ల మరమ్మత్తు చేస్తుండగా, షాక్ గురై అక్కడికక్కడే మృతి చెందారు. అతనికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. సంఘటన తెలిసిన వెంటనే విద్యుత్ అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.

Advertisement
 
Advertisement
Advertisement