వైభవంగా పుష్పాల ఊరేగింపు | Exposition flower parade | Sakshi
Sakshi News home page

వైభవంగా పుష్పాల ఊరేగింపు

Nov 1 2014 1:58 AM | Updated on Nov 9 2018 6:29 PM

వైభవంగా పుష్పాల ఊరేగింపు - Sakshi

వైభవంగా పుష్పాల ఊరేగింపు

అలంకార ప్రియుడైన వేంకటేశ్వరస్వామి సేవకు పుష్పాలు తరలివచ్చాయి. తిరుమల వేంకటేశ్వరస్వా మి ఆలయంలో శుక్రవారం పుష్పయాగం జరిగింది.

తిరుమల : అలంకార ప్రియుడైన వేంకటేశ్వరస్వామి సేవకు పుష్పాలు తరలివచ్చాయి. తిరుమల వేంకటేశ్వరస్వా మి ఆలయంలో శుక్రవారం పుష్పయాగం జరిగింది. ఈ మేరకు శ్రీవారి పుష్పయాగంలో 6 రకాల ఆకులు, 12 రకాల పుష్పాలను వినియోగించారు.  టీటీడీ ఉద్యానవనం నుంచి ఆలయ వరకు ఈ పుష్పాలను శ్రీవారిసేవకులు, టీటీడీ ఉద్యోగులు బుట్టల ద్వారా తీసుకువచ్చారు.

గోవింద నామస్మరణలు చేస్తూ స్వామి సేవకు పుష్పాలను, పత్రాలను ఊరేగింపుగా తీసుకువచ్చారు. స్వామిని తాకే పుష్పాలను తమ చేతుల ద్వారా తీసుకురావటం పూర్వజన్మ సుకృతమంటూ శ్రీవారి సేవకులు ఆనందం వ్యక్తం చేశారు. కాగా, అంతకుముందు ఊరేగింపునకు ప్రారంభంలో జేఈవో శ్రీనివాసరాజు, ఆలయ డెప్యూటీ ఈవో చిన్నంగారి రమణ, ఉద్యానవనం సూపరిటెండెంట్ శ్రీనివాసులు ఉద్యానవనంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement