ఎంట్రీ ట్యాక్స్‌పై న్యాయ పోరాటం: పరకాల | Entry Tax Civil War: blades | Sakshi
Sakshi News home page

ఎంట్రీ ట్యాక్స్‌పై న్యాయ పోరాటం: పరకాల

Apr 5 2015 2:01 AM | Updated on Jul 28 2018 3:23 PM

ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే వాహనాలపై తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపన్ను(ఎంట్రీ ట్యాక్స్) విధించటంపై న్యాయపోరాటం

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే వాహనాలపై తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపన్ను(ఎంట్రీ ట్యాక్స్) విధించటంపై న్యాయపోరాటం చేస్తామని ప్రభుత్వ సమాచార సలహాదారు పరకాల ప్రభాకర్ ప్రకటించారు. ఈ అంశంపై మంత్రివర్గంలో చర్చించి తెలంగాణ ప్రభుత్వానికి సందేశం పంపామన్నారు. పరకాల శనివారం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. పట్టిసీమ ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు శాసనసభలో వివరణ ఇచ్చాక కూడా ప్రతిపక్ష పార్టీ దుష్ర్పచారం సాగించడం మంచిది కాదన్నారు. ఉభయ గోదావరి జిల్లాల ప్రజలను తప్పుదోవ పట్టించడంతో పాటు ఇతర రాష్ట్రాలను ప్రభుత్వంపైకి ఉసిగొల్పుతున్నారని  ఈ సందర్భంగా ప్రతిపక్షనేత నుద్దేశించి విమర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement